Nara Lokesh : సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస  సమావేశాల్లో పాల్గొంటున్నారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.

author-image
By Madhukar Vydhyula
New Update
Nara Lokesh Participates Meeting in Davos

Nara Lokesh Participates Meeting in Davos

Nara Lokesh : దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస  సమావేశాల్లో పాల్గొంటూ ఏపీలో నిధుల పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ-వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై నిర్వహించిన ఈ సమావేశంలో లోకేశ్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పోర్చుగల్ ప్రధాని జోర్డాన్ క్వీన్,  యునెస్కో సైంటిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ "సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడులకు ఆకర్శించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కర్భన ఉద్గారాల నియంత్రణకు క్లీన్ ఎనర్జీ ఎకైక మార్గమని, సుస్థిర శక్తివనరుల్లో ఏపీ ప్రపంచంలో అగ్రగామి కావడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పునరుత్సాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఇటీవల ఏపీలో నాలుగు సోలార్ పార్కులు ప్రకటించిందని పేర్కొన్నారు. హరిత, ఇంధన, పర్యావరణ వ్వవస్థ స్థాపనే ఏపీ లక్ష్యమని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దీనికోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ  పాలసీని ప్రకటించినట్లు తెలిపారు. పునరుత్సాదక శక్తి రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

ఈ విధానం ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. రాష్ట్రంలో పంప్ఠ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలను గుర్తించామన్నారు. ప్రపంచంలోనే  అతిపెద్ద ఐఆర్ఈఎస్ పీ ప్రాజెక్టు ఏపీలో ఉందన్నారు. 2023నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ దిశగా పునరుత్పాదక రంగంలో అగ్రగామిగా ఏపీని నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.

 పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా ప్రముఖ ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సస్ తో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ పరిసరాల్లో అనువైన స్థలంతో పాటు ప్రతిభ కలిగిన ఐటీ వృత్తి నిపుణులు ఏపీలో అందుబాటులో ఉన్నారని లోకేశ్ వివరించారు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో 25 శాతానికి పైగా తెలుగువారే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అన్ని రకాలుగా అనుకూలతలు కలిగిన ఏపీలో కంపెనీ తయారీ నెట్ వర్క్ను విస్తరించాలని కోరారు.

ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్ టెక్ హబ్ గా ఏపీని మార్చడంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఏఐ, నెట్ వర్కింగ్ సైబర్ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ పోర్సును రూపొందించడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని ప్రాన్సిస్ ను కోరారు,  కాగా ఏపీ ప్రభుత్వం చేసిన ప్రాతిపాదనలపై కంపెనీలో చర్చించి నిర్ణయం తీసుంటామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు