Sexual assault : కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం..,చిన్నారులపై లైంగికదాడి

కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు స్థానిక దర్గా సెంటర్‌లో బంగారు ఆభరణాలు తయారీ షాపు యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు

New Update
 Sexual assault

Sexual assault

Sexual assault : కాకినాడ జిల్లా పెద్దాపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన స్థానికులు సదరు వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్‌లో బంగారు ఆభరణాలు తయారీ షాపు నిర్వహిస్తున్న యజమాని కామేశ్వరరావు ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామేశ్వరరావు. చిన్నారులకు చాకెట్లు, డబ్బుల ఆశచూపి రేప్‌ కామేశ్వరరావు రేప్‌ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: రీ-రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన 'సలార్'.. అరాచకం సామి ఇదీ!!

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

కొంతకాలంగా చిన్నారులపై కామేశ్వరరావు అత్యాచారం చేస్తున్నట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు.  స్కూలు నుంచి ఇంటికి వచ్చిన చిన్నారులకు తీవ్ర కడుపునొప్పి రావడంతో పిల్లలను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు వారి ప్రైవేట్‌ పార్ట్స్‌లో తీవ్రగాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు.

Also Read: లారెన్స్ మామూలోడు కాదుగా.. ఈ సారి ఏ దెయ్యానికి బాడీ అద్దెకు ఇస్తున్నాడంటే..?

దీంతో పిల్లలను విచారించగా కామేశ్వరరావు చేసిన అఘాయిత్యం వెలుగులోకివచ్చింది.దీంతో ఆగ్రహానికి గురైన చిన్నారుల బంధవులు స్థానికులు కామేశ్వరరావుపై చెప్పులు ,చీపుర్లతో దాడి చేశారు. దీంతో కామేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు తీవ్రంగా గాయపడటంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై  ఎస్‌ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: సీఎం రేవంత్ కు షాకిచ్చిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు.. అలా చేశారేంటి?

నిన్న జరిగిన CLP భేటీకి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ ముగ్గురు.. ఎందుకు రాలేదన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

New Update

మంత్రివర్గ విస్తరణ అంశం తెలంగాణ కాంగ్రెస్ కు, సీఎం రేవంత్ కు తలనొప్పిగా మారింది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు స్వరం పెంచారు. తమను అడ్డుకుంటున్న వారిపై, హైకమాండ్ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సారగ్ రావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. వివేక్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయితే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కు మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేబినెట్ విస్తరణలో తమకు చోటు కల్పించాలంటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు సీఎల్పీ భేటీకి ఎందుకు హాజరు కాలేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వంపై అలిగే వీరు హాజరుకాలేదా? అన్న చర్చ సాగుతోంది. 

ఇదిలా ఉంటే.. నిన్నటి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ విస్తరణపై పార్టీ నేతలు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మంత్రివర్గం విస్తరణను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ లైన్‌ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment