అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి

ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న కోసం తాను చాలా చేశానని.. జగన్ మాత్రం తనకోసం ఏమీ చేయలేదంటూ కంటతడిపెట్టుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
Sharmila jagan

ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవీ సుబ్బారెడ్డి.. జగన్ మోచేతి నీళ్లు వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. '' సుబ్బారెడ్డి జగన్ పక్కన ఉండి పదవులు అనుభవిస్తున్నారు.  రాజకీయంగానే కాకుండా ఆర్థికంగానూ లాభపడ్డారు. ఈరోజు సుబ్బారెడ్డి మాట్లాడారు. రేపు సాయిరెడ్డి మాట్లాడతారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి లలో నిజాయితీ ఉందో లేదో చూద్దామని ఇద్దరి పేర్లు లేఖలో రాశా. అన్ని తెలిసి కూడా దిగజారిపోయి మాట్లాడుతున్నారు 

ఎవరు చెప్పింది నిజమో నా బిడ్డలపై ప్రమాణం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తారా ?. ఆస్తుల వివాదంపై విజయమ్మ మాట్లాడతారో లేదో ఆమె ఇష్టం. నలుగురి బిడ్డలకు సమానంగా ఆస్తులు ఇవ్వాలని వైఎస్‌ఆర్ అనుకున్నది పచ్చి నిజం. నలుగురు బిడ్డలకు సమాన వాటా ఇవ్వాలని రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. నాన్న నీ తర్వాత చెల్లి మేలు కోరేది నేనే అని జగన్ వైఎస్‌ఆర్‌తో అన్నారు. అలా అడగలేదని జగన్ తన పిల్లలపై ప్రమాణం చేసి చెప్పగలరా ?. జగన్ భారతి పేర్లు పెట్టుకున్నారు కనుక ఆస్తులు మావి అంటే ఎలా ?. వాళ్ళు పేర్లు పెట్టుకోగలిగారు అంటే మా అంగీకారంతోనే. 

నేను జైలుకి వెళ్ళలేదు అని అడుగుతున్నారు మరి భారతి ఎందుకు జైలుకి వెళ్ళలేదు. గిఫ్ట్ ఇస్తామని MOU ఎవరూ రాయరు. నాకు ఆస్తులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టే MOU రాశారు. . సరస్వతి షేర్స్ వెంటనే ట్రాన్ఫర్ చేస్తామని MOUలో ఉంది. సరస్వతి షేర్స్ ఈడి అటాచ్మెంట్‌లో లేదు. కన్న తల్లిపై కేసులు వేసే దౌర్భాగ్యలు ఎవరైనా ఉన్నారా ?. సొంత కొడుకే తనపై కేసు వెయ్యడంతో విజయమ్మ కుమిలిపోతున్నారు. తనకి లబ్ధి జరుగుతుందని తల్లిని కోర్టుకి ఈడుస్తారా ?. జగన్‌కు మానవత్వం, ఎమోషన్ సెంటిమెంట్స్ లేవా ?. సజ్జల, పేర్ని నాని ఏమి మాట్లాడినా నేను పట్టించుకోలేదు. కానీ సుబ్బారెడ్డి మాటలకు నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. 

సుబ్బారెడ్డి నా సొంత చిన్నాన్న. ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు. అందరం కలిసి కష్టపడితే వైసీపీకి భారీ విజయం దక్కింది. నాకు చేతనైన దానికంటే ఎక్కువ కష్టపడి పని చేశా. విజయమ్మ కూడా ఎంతో కష్టపడి పని చేశారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా పాదయాత్ర చేశా. రెండు ఎలక్షన్స్‌లో తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం చేశాను. నా అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమి చేయలేదు. MOU ఐదేళ్లుగా నా దగ్గర ఉన్నా ఏనాడు బయటపెట్టలేదు. వైఎస్‌ఆర్ పేరును ఛార్జ్‌షీట్‌టులో చేర్పించిన పొన్నవోలు సుధాకరరెడ్డి కి పదవులు ఇచ్చారు. జగన్ నాయకుడో, సాడిస్టో అర్థం చేసుకోవాలి. ఇలాంటి కొడుకుని చిన్నప్పుడే చంపేస్తే బాగుణ్ణు కదా అని అమ్మ  అనుకోలేదు.. నేను చచ్చిపోతే బాగుండు అనుకుందని'' షర్మిల అన్నారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు