Floods : ఆపరేషన్ బుడమేరు.. వరదలు రాకుండా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఇదే!

విజయవాడకు మరో సారి వరద రాకుండా ఉండడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ బుడమేరకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించనున్నారు. అనంతరం గడ్లను పటిష్టం చేయనున్నారు.

author-image
By Nikhil
New Update
Operation Budameru

Chandrababu : ఇటీవల వరదలకు విజయవాడ (Vijayawada) మహానగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. విజయవాడ దుఖఃదాయని అని పేరున్న బుడమేరే ఈ విపత్తుకు కారణమైంది. బుడమేరు వాగుకు గండ్లు పడడం, వాగులోకి సాధారణం కంటే మూడు రెట్లకు పైగా నీరు చేరడంతో ఈ ప్రమాదం తలెత్తింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఓ వైపు వరద బాధితులకు సహాయం చేస్తూనే మరోవైపు బుడమేరు గండ్ల పూడ్చివేతను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు రోజులపాటు వాగు గట్టుపైనే ఉండి పూడ్చివేత పనులు పూర్తి చేయించారు. ఆర్మీసైతం రంగంలోకి దిగి గండ్ల పూడ్చివేతలో ప్రభుత్వానికి సహాయం చేసింది. ప్రస్తుతం వరద ఆగడం, గండ్ల పూడ్చివేత కంప్లీట్ కావడంతో ప్రభుత్వం వరద రాకుండా శాశ్వతంగా చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Also Read :  పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 25 మంది మృతి!

Budameru : 

బుడమేర (Budameru) కు వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? భవిష్యత్ లో సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వాగు పరివాహక ప్రాంతంలో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మొదటగా ఆక్రమణలను తొలగింపునకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అయితే.. ఈ కార్యక్రమం ఎలాంటి ఉద్రిక్తతలు, ఆందోళనకు చోటు లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు చేసిన వారిని, సరైన అవగాహన లేకుండా అక్కడ స్థలాలు కొన్న వారిని పిలిచి చర్చించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

పరిస్థితిని వారికి వివరించి ఒప్పించాలని సర్కార్ యోచిస్తోంది. బుడమేరు గట్ల వెంట గతంలో కొందరు ఇసుకను, మట్టిని ఇష్టారాజ్యంగా తోడుకుని అమ్ముకున్నట్లు సైతం ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు వాగు ప్రవాహం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు అవసరమైన ప్రాంతాల్లో కల్వర్టులను నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో బుడమేరుకు వరద నీరు 15 వేల క్యూసెక్కుల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ సారి ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో బుడమేరకు రికార్డుస్థాయిలో 45 వేల క్యూసెక్యుల వరద నీరు రావడంతో వరద పరిస్థితులు తలెత్తాయి. భవిష్యత్ లో ఈ స్థాయిలో వరద నీరు వచ్చినా.. తట్టుకునేలా వాగును విస్తరించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇంకా ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ ను నిర్మించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించి రీటైనింగ్ వాల్ కు సంబంధించి డీపీఆర్ ను అధికారులు సిద్ధం చేయనున్నారు.

Also Read :  విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌..దుబాయ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు