ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు..ఎందుకంటే! ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. By Bhavana 29 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Ap: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు ఓ వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్‌కు సంబంధించిన ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెంకట్రామిరెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మందు, విందు పార్టీ ఏర్పాటు చేశారని సమాచారం. Also Read: PASSPORT: రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. అర్ధరాత్రి సమయంలో ఆ పార్టీపై దాడి చేసి వెంకట్రామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులను ప్రభావితం చేయడానికి మందు పార్టీ ఏర్పాటు చేశారని తెలుస్తుంది. Also Read: మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు! ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటు చేయాలంటే ముందుగానే ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు కచ్చితంగా ఉన్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో.. స్థానిక పోలీసులతో కలిసి వెళ్లారు. కొండపావులూరి గార్డెన్‌లో సోదాలు చేయగా.. అక్కడ ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం లభించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే తమకు ఏమీ తెలియదని.. వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చామని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో పోలీసులు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. Also Read: Putin: ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్ కీలక వ్యాఖ్యలు! సచివాలయం క్యాంటీన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 డైరెక్టర్ పదవులు ఉండగా.. 28 మంది పోటీ పడుతున్నారు. వెంకట్రామిరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీ చేస్తున్నారు. అయితే వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. ఇప్పుడు క్యాంటీన్ ఎన్నికల కోసం ఇలా మందు పార్టీ ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. Also Read: Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు! నిబంధనలకు విరుద్దంగా పార్టీని ఏర్పాటు చేసినందుకు వెంకట్రామిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో.. ఇక్కడ ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు వెంకట్రామిరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. #andhra pradesh secretariat venkatramireddy arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి