Kadapa: సొంత జిల్లా కడపలో జగన్ కు బిగ్ షాక్!

కడపకు చెందిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లు నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. కార్పొరేషన్ పై పసుపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Jagan TDP YCP

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగిలింది. కడప నగర పాలక సంస్థకు చెందిన 8 మంది కార్పొరేటర్లు, నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.  
ఇది కూడా చదవండి: కేటీఆర్ నేను బాగా క్లోజ్.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు!

ఇది కూడా చదవండి: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి

తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు వీరే..

2వ డివిజన్ కార్పొరేటర్ M. సుబ్బారెడ్డి 
3వ డివిజన్ కార్పొరేటర్ M. మానస
6వ డివిజన్ కార్పొరేటర్ E. నాగేంద్ర 
8వ డివిజన్ కార్పొరేటర్ A. లక్ష్మీదేవి
25వ డివిజన్ కార్పొరేటర్ K. సూర్యనారాయణ రావు
32వ డివిజన్ కార్పొరేటర్ S.B. జఫ్రుల్లా 
42వ డివిజన్ కార్పొరేటర్ C. స్వప్న 
50వ డివిజన్ కార్పొరేటర్ K. అరుణ ప్రభ

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప సీటును టీడీపీ కైవసం చేసుకుంది. ఆర్ మాధవి అక్కడ టీడీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. అక్కడ వైసీపీ మేయర్ ఉండడంతో తరచుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెజార్టీ కార్పొరేటర్లను చేర్చుకుని మేయర్ కు షాక్ ఇవ్వాలని ఎమ్మెల్యే మాధవి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో కడప కార్పొరేషన్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఇది కూడా చదవండి: రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతంలో ప్రకటించినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటి నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
AP

AP Government

ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 16, 347 ఉపాధ్యాయుల పోస్టులకు దీన్ని రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. రేపటి నుంచి మే 15 వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. జూన్‌ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో డీఎస్‌సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌లోనిర్వహిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. 

 

 

today-latest-news-in-telugu | andhra-pradesh | mega-dsc not present in content

Also Read: Punjab: ఐఎస్ఐ ఉగ్ర కుట్ర భగ్నం..భారీగా ఆయుధాలు స్వాధీనం

Advertisment
Advertisment
Advertisment