మంత్రిగా నాగబాబు.. ఆ శాఖలు ఫిక్స్.. రోజాకు బిగ్ షాక్?

జనసేన MLC అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది. క్రీడా శాఖను నాగబాబుకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ వేగవంతం అవుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

New Update

జనసేన నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. కూటమికి సంపూర్ణ మెజార్టీ ఉండడంతో ఆయన ఎమ్మెల్సీ కావడం ఖాయమైంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు టీడీపీ గతేడాది డిసెంబర్ లోనే అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుని.. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారన్న ప్రచారం సాగింది. అయితే.. ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా మంత్రి పదవి తీసుకోవడం సరికాదని జనసేన అధినేత పవన్ భావించారు. దీంతో ఇప్పటివరకు నాగబాబుకు మంత్రిపదవి కేటాయించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నాగబాబుకు మంత్రిపదవి అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది.

మంత్రి పదవి పక్కా..

తాజాగా ఆయనను జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఖరారు చేయడంతో మంత్రి కావడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత నాగబాబు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అయితే.. నాగబాబుకు కేటాయించే మంత్రుల శాఖలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయనకు సినీ, క్రీడా శాఖ మంత్రిగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా పని చేశారు. ఆమె హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీల్లో తీవ్ర అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 

రూ.119 కోట్ల ఖర్చుతో నిర్వహించిన ఈ క్రీడాపోటీల్లో ఎమ్మెల్యేలు, మంత్రి రోజా కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది.  ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుకు క్రీడా శాఖ కేటాయిస్తారన్న వార్తలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా నాగబాబుకు క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయిస్తే ఆడుదాం.. ఆంధ్రలో అవినీతి అంశంపై విచారణ మరింత వేగవంతంగా మారే ఛాన్స్ ఉంది. గతంలో నాగబాబు, రోజా జబర్దస్త్ జడ్జీలు పని చేశారు. టీం లీడర్లు, కంటెస్టెట్లకు సరైన గౌరవం ఇవ్వట్లేదని ఆరోపణలు చేస్తూ నాగబాబు జబర్దస్త్ ను వీడారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా జడ్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు