AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్‌ వేటు..!

ఏపీ సీఐడీ మాజీ ఏడీజీ ఎన్‌. సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. గత ప్రభుత్వ హయాంలో సంజయ్‌ సీఐడీ అదనపు డీజీగాను, ఏపీ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సంస్థ డీజీగాను పనిచేశారు. ఈ సమయంలో ఆ విభాగాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలువచ్చాయి.

New Update
sanjay

Ap News: ఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ ఎన్‌ సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన గతంలో అగ్నిమాపక డైరెక్టర్‌ జనరల్‌గా, సీఐడీ చీఫ్‌గా పనిచేయగా..ఆయన తన అధికారిక హోదాలను అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేపట్టగా.. ఆ నివేదిక ఆధారంగా అఖిల భారత సర్వీసుల నియమావళిలోని 3 (1) సెక్షన్‌ ప్రకారం ప్రభుత్వం సంజయ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. 

Also Read: AP: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు!

అలాగే అనుమతి లేకుండా ఆయన విజయవాడ దాటకూడదని సీఎస్ నీరబ్‌ ఉత్తర్వులు జారీచేశారు. సంజయ్ అగ్నిమాపక డీజీగా ఉండగా అగ్ని-ఎన్‌వోసీ టెండర్ల ప్రక్రియలో అక్రమాలతోపాటు నిబంధనల అమలులో అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తెలిసింది. గత ప్రభుత్వం హయాంలో అగ్ని పోర్టల్‌లో ఎన్‌వోసీ, హార్డ్‌వేర్‌ సరఫరా కోసం రూ.2.29కోట్ల ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంజయ్‌ కట్టబెట్టారనే అభియోగాలు కూడా ఉన్నాయి.

Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణకు సంబంధించి 1.19 కోట్ల బడ్జెట్‌ను గత ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సుల్నిక్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటె డ్‌ పేరుతో ఉన్న కంపెనీ ద్వారా నిర్వహించారు.ఈ సదస్సుల నిర్వహణకు సంబంధించి ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల కోసం సదస్సుల నిర్వహణకు రూ.59.52 లక్షలు, ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు రూ.59.51 లక్షల చొప్పున మొత్తం రూ.1.19 కోట్లు చెల్లింపులు చేశారు. సదస్సుల నిర్వహణ మొత్తం క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ చేపట్టాల్సి ఉన్నా సీఐడీ అధికారులే వాటి బాధ్యతలను చేపట్టారు.

Also Read: Lokesh: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం

అదీ రూ.3.10 లక్షలే ఖర్చుచేశారు. క్రిత్వ్యాప్‌ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట రూ.1.15 కోట్లు దోచేశారు' అని విజిలెన్స్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.ఈ కంపెనీ చూపించిన రిజిస్టర్‌ అడ్రస్‌లో లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఊరూపేరు లేని కంపెనీ పేరుతో అదనంగా రూ. 1.15 కోట్లు దుర్వినియోగం చేశారనే అభియోగాలు ఉన్నాయి. క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డొల్ల కంపెనీగా రుజువైంది.

Also Read: మహారాష్ట్రలో కీలక పరిణామం.. షిండే ఇంటికి చేరుకున్న ఫడ్నవీస్

ఆ సంస్థ అడ్రస్‌ అయిన.. ఫ్లాట్‌ నంబర్‌ 601, లలితాంజలి అపార్ట్‌మెంట్, ద్వారకాపురి కాలనీకి  వెళ్లి విజిలెన్స్‌ అధికారులు చూడగా అసలు అక్కడ ఆ సంస్థే లేదని తెలిసింది. అదే అడ్రస్‌లో సౌత్రిక టెక్నాలజీస్‌ కొనసాగుతున్నట్లు గుర్తించారు.
క్రిత్వ్యాప్, సౌత్రిక రెండూ ఒకే సంస్థలని తేలింది. అక్రమాలకు ప్రధాన బాధ్యుడు సంజయేనని తేలటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది.

అనుమానాస్పద సంస్థలకు ఒప్పందాలు ఇవ్వడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ఆధారంగా సంజయ్‌ని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసింది. ఆయనపై అధికార దుర్వినియోగం, ప్రజాధనం స్వాహా, ప్రభుత్వ నిబంధనల అతిక్రమణ కింద చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ ఆరోపణలపై మరింత స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు