ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచే ఉచిత సిలిండర్

ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీపావళి నుంచే పథకం అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు? ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలపై పౌరసరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది.

New Update
d777c0b7-4b4d-4d81-87aa-a445371f2326


ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై కసరత్తులు చేస్తోంది. దీపావళి నుంచే ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఏపీలో మొత్తం కోటి 55 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకానికి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది? ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారు? అనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు దారులకు మాత్రమే వర్తించే ఈ పథకం మొత్తం ఖర్చు రూ.3640 కోట్లు అవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర ప్రభుత్వ పథకాల కనెక్షన్లు మొత్తం 75 లక్షలు ఉన్నాయి. కేవలం వీరికి మాత్రమే అమలు చేస్తే మొత్తం 1763 కోట్ల వ్యయం అవుతుంది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.825.50 ఉంది. సూపర్ సిక్స్ అమలులో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తే ఒక్కో కుటుంబానికి రూ.2476.50 అవుతుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు