ఎస్పీతో పాటు ఆ పోలీస్ అధికారిపై వేటు..చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 06 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు వేసింది. కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అయితే పోలీసుల భద్రత నుంచి రవీందర్‌రెడ్డి తప్పించుకోవడం సంచలనంగా మారింది. పథకం ప్రకారమే పోలీసులే ఆయనను తప్పించారనే చర్చ సాగుతోంది. తాలూకా పీఎస్ ముందు మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు.ఇది కూడా చదవండి: మహిళలపై పోస్టులు పెడితే ఊరుకోవాలా?: కేబినెట్ మీటింగ్ లో పవన్ ఫైర్! పీఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు మరో జిల్లా పోలీసులు మఫ్టీలో సిద్ధంగా ఉన్నారు. అయితే.. పీఎస్ నుంచి బయటకు వచ్చిన రవీందర్ రెడ్డి తాను మీడియా అని చెప్పి రవీందర్ రెడ్డి తప్పించుకుని వెళ్లిపోయారు. వర్రా తప్పించుకున్న కొద్ది నిమిషాల్లోనే సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి బయటకు వచ్చాడు. మహేశ్వర్‌రెడ్డిపై సీఐ చేయి చేసుకున్నాడు. సీఐ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కూడా చదవండి: Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ ఇది కూడా చదవండి: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే! అన్నమయ్య ఎస్పీకి అదనపు బాధ్యతలు.. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును బదిలీ చేసిన ఏపీ సర్కార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అన్నమయ్య ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడికి కడప ఎస్పీగా అదనపు భాద్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: తిరుపతి లడ్డూ వివాదం..రంగంలోకి దిగిన CBI #chandrababu #suspend #varra ravinder reddy #Kadapa-sp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి