Pawan : పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే! అండమాన్ నికోబార్ రాజధాని పోర్టుబ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీ విజయపురంగా మార్చుతూ కేంద్రం ప్రకటించిగా..ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. By Bhavana 15 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి Pawan Kalyan: బ్రిటీష్ కాలం నాటి పేర్లను మార్చే క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్టుబ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం శ్రీ విజయపురంగా మార్చుతూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. అణచివేసిన వలసపాలనకు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని పవన్ అన్నారు. శతాబ్దాల పాటు దేశాన్ని అణచివేసిన వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్పాలనే నిర్ణయం భారత్ సాధించిన విజయాలను మరింత గౌరవింప చేస్తుందని పవన్ పేర్కొన్నారు. వలస వారసత్వం... ఇది ప్రశంసనీయమైన చర్య అని కొనియాడారు. వలస వారసత్వం ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించడానికి ఈ నిర్ణయం మంచి నిర్ణయంగా తాను నమ్ముతున్నట్టు పవన్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయం గురించి చర్చించారు. Also Read: ఆర్జీ కర్ ప్రిన్సిపల్ సందీప్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి