Sharmila: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

AP: ఆస్తుల వివాదంపై వైసీపీ చేసిన ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఇప్పుడు రాజకీయం చేద్దామనే ఆలోచనతోనే జగన్ ఈ ఆస్తుల వివాదాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు నేను చేస్తున్న కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఆమె అన్నారు.

New Update
Jagan Sharmila:రాజారెడ్డి నిశ్చితార్థం.. జగన్‌-షర్మిల-విజయమ్మ ఫొటోలు వైరల్‌!

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అన్నారు షర్మిల. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని అన్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని.. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ..  వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో  ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని తెలిపింది. 2016 లో ED, భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. 

Also Read :  సజ్జలకు ఊహించని షాక్

అప్పుడు తెలీదా జగన్...

2019 లో తనకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU మీద సంతకం చేశారని ఆమె అన్నారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని?..  2021 లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన , సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు?..  అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? అపుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా ? అని నిలదీశారు. 2021 లో జగన్, భారతి రెడ్డి తమ షేర్స్ పై సంతకం చేసి.. విజయమ్మకి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని? అని ఆమె అడిగారు.

Also Read :  ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు

షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారని విమర్శించారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. NCLT లో కేసు ఉంది కాబట్టి.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని.. కొడుకు బెయిల్ కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మకి తెలుసు అని అన్నారు.

Also Read :  ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు

Also Read :  కాణిపాకంలో అపచారం..ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment