వాళ్లిద్దరు ఓకే అంటే కుర్చీ,టెంట్‌ కూడా రెడీ..మంత్రి పయ్యావులు కౌంటర్‌

బియ్యం రవాణా అంశంలో తన వియ్యంకుడి పై వచ్చిన ఆరోపణలకు మంత్రి పయ్యావుల కేశవ్ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.అంబటి,పేర్ని నాని కావాలంటే టెంట్‌, కుర్చీ వేసుకొని చెక్‌ చేసుకోవచ్చని అన్నారు.

New Update
p

Ap News: తన వియ్యంకుడి కుటుంబం మూడు తరాలుగా బియ్యం ప్యాపారంలో ఉందని  మంత్రి పయ్యావుల కేశవులు తెలిపారు. తన వియ్యంకుడి కంపెనీ దేశంలోనే భారీ ఎత్తున బియ్యం ఎగుమతి చేసే కంపెనీల్లో టాప్‌ మోస్ట్‌ కంపెనీల్లో ఒకటని మంత్రి అన్నారు. ఈ మేరకు పయ్యావుల మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. తన వియ్యంకుడికి కాకినాడ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం అక్రమ ఎగుమతులతో ఎలాంటి సంబంధం లేదని వివరించారు.

Also Read: AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్‌ వేటు..!

ఒకవేళ అంబటి రాంబాబు, పేర్ని నానిలకు ఏమైనా సందేహాలుంటే పోర్టు దగ్గర చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకుని.. తన వియ్యంకుడి కంపెనీ నుంచి వెళ్లే ప్రతి లారీని ఆపి ప్రతి బియ్యం బస్తాను తనిఖీ చేసుకోవచ్చునని సెటైర్లు వేశారు. తానే అంబటి, పేర్ని నాని కూర్చోవడానికి కుర్చీ, టెంట్‌ కూడా రెడీ చేస్తానని గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే!

తన వియ్యంకుడి గోదాం నుంచి లారీ బయల్దేరిన వెంటనే ఆ సమాచారం వారికి తెలిసేలా నేనే ఏర్పాట్లు చేస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. తన వియ్యంకుడి కంపెనీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని.. సొంత మిల్లులో మర పట్టించి ఎగుమతి చేస్తుందని చెప్పారు. ఆ కంపెనీ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తినే పారాబాయిల్డ్‌ రకం బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. అయినా వారంతా తనతో వియ్యం పొందాక ఈ వ్యాపారంలోకి దిగలేదు.. వాళ్ల కుటుంబం కొన్ని దశాబ్దాలుగా బియ్యం ఎగుమతి వ్యాపారం చేస్తుందని చెప్పారు. 

Also Read: Lokesh: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌..ఇక నుంచి మధ్యాహ్నా భోజనం

దేశంలో వాళ్ల కంపెనీ అతి పెద్ద బియ్యం ఉత్పత్తిదారు కూడా అని చెప్పారు. తన వియ్యంకుడి కంపెనీ ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదని.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని మంత్రి చెప్పారు. గత ఐదేళ్లలో ఇసుక , మద్యం, బియ్యంలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు. అన్నిటిని స్టీమ్ లైన్ చేస్తున్నామన్నారు. 

Also Read: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో వైన్‌షాప్‌లు బంద్!

ఈ మేరకు కేబినెట్‌లో చర్చించామని.. గతంలో జరిగిన తప్పుడు విధానాలను సరిదిద్దుతున్నట్లు తెలిపారు. అసలు దేశంలో జరుగుతున్న అదానీ అవినీతి వ్యవహారం బయటకు తీసింది తానేనని.. ఇప్పటికైనా ప్రపంచం తనను గుర్తించినందుకు సంతోషమని తెలిపారు. కోర్టులో కేసు వేసింది కూడా తానేనని.. పార్లమెంటు లో  అదానీ వ్యవహారంపై వాయిదా పడుతూనే ఉందని.. ఏమి జరుగుతుందో చూద్దాం అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి బియ్యం అక్రమ రవాణాపై ఆరా తీశారు. అయితే పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అలాగే మంత్రి పయ్యావుల వియ్యంకుడిపై నాని ఆరోపలు చేశారు. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను సీజ్ చేయమని చెప్పిన పవన్.. పక్కనే ఉన్న కెన్ స్టార్ షిప్‌ను ఎందుకు సీజ్ చేయమనలేదో చెప్పాలన్నారు. 

కెన్ స్టార్ షిప్ యజమాని శ్రీను మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకులని.. అందుకే ఆ షిప్ ముట్టుకోలేదన్నారు. పవన్‌ కెన్ స్టార్ షిప్‌ను కూడా సీజ్ చేయాలని పేర్ని అన్నారు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి కౌంటరిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు