Ap: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. !

ఏపీలో రేషన్‌ కార్డులున్న వారికి చంద్రబాబు సర్కార్‌ తీపికబురు చెప్పింది. వచ్చే నెల నుంచి అన్ని కార్డులపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు అందించడానికి చర్యలు మొదలు పెట్టారు.అలాగే పంచదారను కూడా రేషన్‌‌తో పాటుగా పంపిణీ చేస్తారు.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

Ap: ఏపీలో రేషన్‌ కార్డులున్న వారికి చంద్రబాబు సర్కార్‌ తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును తక్కువ ధరకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బయట మార్కెట్‌లో కంది పప్పు కేజీ రూ.180 ఉండగా.. రైతు బజార్లలో ఇప్పటికే కందిపప్పు కౌంటర్లు తెరచి కిలో రూ.110కే ఇస్తున్నారు. 

Also Read: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు

అయితే నవంబర్ నెల నుంచి కందిపప్పు, పంచదారను బియ్యంతో పాటుగా పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. రెండు నెలల కిత్రం దీని కోసం టెండర్లు పిలవగా.. గత నెల నుంచి గోడౌన్‌లకు సరుకు చేరుతోంది. నవంబరులో రేషన్‌కార్డులు ఉన్నవారికి కందిపప్పు, పంచదార ఇవ్వనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టర్లను కొత్తగా ఎంపిక చేసింది. సరుకులకు సంబంధించి కచ్చితమైన తూకం, నాణ్యమైన సరకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం

 కేజీ రూ.67 చొప్పున..

వచ్చే నెల నుంచి అన్ని కార్డులపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు అందించడానికి చర్యలు మొదలు పెట్టారు.  అలాగే పంచదారను కూడా రేషన్‌‌తో పాటుగా పంపిణీ చేస్తారు. చక్కెరను ఏఏవై కార్డుదారులకు కేజీ రూ.14, మిగిలిన వారికి అరకేజీ రూ.17 చొప్పున ఇవ్వనున్నారు. ఇకపై ప్రతీ నెలా కందిపప్పు నూరు శాతం కార్డుదారులకు అందిస్తామంటున్నారు అధికారులు.

Also Read:  ఫలించిన కానిస్టేబుల్ భార్యల కృషి.. సెలవుల రద్దు నిర్ణయం నిలిపివేత

మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కందిపప్పు, చక్కెర ధరలు బాగా తగ్గించింది. రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150 నుంచి రూ.180 వరకు ఉంది. ప్రభుత్వం రాయితీపై కిలో కందిపప్పును రూ.67కే అందించాలని నిర్ణయం తీసుకుంది. బయట మార్కెట్‌లో కిలో పంచదార రూ.50కి పైగా ఉండగా.. అరకిలో చక్కెర రూ.17  కే ఇచ్చేందుకు  పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది. నిత్యావసరాల ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: ట్రంప్ గెలిస్తే వీసాలు టైట్..ఐటీ కష్టాలు మళ్ళీ మొదటికి

 మొన్న దసరా, ఈ నెలాఖరులో దీపావళి పండుగలు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కందిపప్పు, చక్కెర మాత్రమే కాదు.. గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్‌తో పాటూ అందించే పనిలో ఉంది. జనవరి నుంచి ఈ సరకుల్ని కూడా రేషన్‌తో పాటుగా పంపిణీ చేయాలని అనుకుంటుంది.`

Advertisment
Advertisment
తాజా కథనాలు