Vajpayee: భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరు పొందిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయ్యింది. ఎంపీలోని గ్వాలియర్ లో 1924 డిసెంబర్ 25న కృష్ణ బిహారీ వాజ్‌పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957 లో తొలిసారి ఎంపీ అయిన వాజ్‌పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. advani Also Read: PV Sindhu: వేడుకగా పీవీ సింధు వెడ్డింగ్ రిసెప్షన్...హాజరైన ప్రముఖులు వీరే! 1996 లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష , రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు అణుదేశానికి ఎంతో సేవ చేశారు. vajapy2 ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకుని.. అక్కడే ఉన్నారు. నేడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. vajapayee2 Also Read: Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రోజు స్పర్శ దర్శనం రద్దు! ఈరోజు ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రీయ స్మృతిస్థల్‌కు వెళతారు.. అక్కడ ఎన్టీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో కలిసి వాజ్‌పేయి సమాధి 'సదైవ్ అటల్' దగ్గర నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. Also Read: AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఈరోజు సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు సమావేశం. 2025 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో.. ఏపీ డిమాండ్లను ప్రధాని, హోంమంత్రికి అందజేయనున్నట్లు సమాచారం. Also Read: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ అలాగే గత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను సైతం పూర్తి చేయడం పై కూడా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు కలవనున్నారు. విశాఖపట్నం స్లీల్ ప్లాంట్ అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.