Chandrababu Naidu: తిరుమల తిరుపతిని సంప్రోక్షణ చేయాలి! తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు.ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం... తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సంప్రోక్షన లడ్డూ పోటు నుంచి ప్రారంభించాలన్నారు. By Bhavana 21 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Chandrababu Naidu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని.. భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల లడ్డూపై ఇప్పుడు నెలకొన్న వివాదం భక్తులను కలవరపెడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని టెస్టుల్లో తేలిందని టీటీడీ ఈవో శ్యామలరావు కూడా ప్రకటించారు. ఏఆర్ డెయిరీస్ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యికి సంబంధించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా... అందులో జంతు కొవ్వు కలిసినట్టు తేలిందన్నారు. ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపేసి... ఏఆర్ డెయిరీస్ సప్లయర్స్‌ని రద్దు చేసినట్లు తెలిపారు. ఇక... తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవకతవకలు జరగడానికి వీల్లేదని... గట్టిగా చెప్పారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడకూడని పదార్థాలను వాడిన నేపథ్యంలో తిరుమల సంప్రోక్షణ జరపాలని నిర్ణయించారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం... తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉన్న నెయ్యి వాడటంతో... తిరుమల అపవిత్రం అయ్యిందని అన్నారు. అందుకే... శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలన్నారు. తిరుమల సంప్రోక్షను ముందుగా... లడ్డూ పోటు నుంచి ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను కూడా సంప్రోక్షణ చేయాలన్నారు. అందుకుగాను ఆగమ, వైదిక శాస్త్రాల్లోని పద్దతులను అనుసరించాలని సూచించారు. అంతేకాదు... తిరుమల సంప్రోక్షణకు సంబంధించిన విధివిధానాలు తెలియజేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి