AP CID : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఐడీ సోదాలు

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై సీఐడీ విచారణ నిర్వహిస్తోంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టలరీలలో సోదాలు చేస్తోంది సీఐడీ. లిక్కర్ అమ్మకాలు, సరఫరా, ధరలపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.

New Update
AP CID searches

ఏపీ వ్యాప్తంగా మద్యం డిస్టలరీస్ లో సీఐడీ (AP CID) సోదాలు నిర్వహిస్తోంది. గత ప్రభుత్వ హయంలో జరిగిన లిక్కర్ అమ్మకాలు, సరఫరా, ధరల నిర్ణయం అంశాలపై తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దీంతో పాటూ మద్యం నాణ్యతపై కూడా సీఐడీ ఆరా తీస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ కాంటినెంటల్ వైన్స్ లిమిటెడ్, బీఆర్కే స్పిరిట్స్, గండేపల్లి, సెంతినీ బయో ప్రొడక్ట్స్ సంస్థ,  కంకిపాడు బీవీఎస్ డిస్టలరీస్, గంపల గూడెంలోని శ్రావణి ఆల్కో సంస్థలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: డ్రోన్ మార్కెట్ కు నేనే బ్రాండ్ అంబాసిడర్, వారికిదే ఛాలెంజ్: చంద్రబాబు

 

ఎంత మద్యం తయారు చేశారు?

వీటితో పాటు నంద్యాలలో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌ను సైతం సీఐడీ అధికారులు పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. సీఐడీ అదనపు ఎస్పీ హుస్సేన్‌ పీర ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఇంకా కడప శివారులోని ఈగల్ డిస్టిలరీ కేంద్రంలో సైతం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి, కుప్పంలోనూ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంత మొత్తంలో మద్యం తయారు చేశారు. ఎంత సరఫరా చేశారన్న కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: ఒకేసారి గాల్లోకి 5500 డ్రోన్లు.. దేశంలోనే ఏపీలో అతిపెద్ద డ్రోన్ షో

సీఐడీ విచారణకు చంద్రబాబు ఆదేశం..

గత ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. ఇదో భయంకరమైన స్కామ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఈడీ కేసుకు కూడా అర్హమైనదని పేర్కొన్నారు. ఈ కేసును ఈడీకి కూడా రిఫర్ చేస్తామన్నారు. ఈ ఏడాది జులైలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చేశారు చంద్రబాబు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు

ఇది కూడా చదవండి: అమిత్‌షాకు కోల్‌కతా జూ.డాక్టర్‌ తండ్రి లేఖ.. ఏం చెప్పారంటే ?

Advertisment
Advertisment
తాజా కథనాలు