YCP 4th List : వైసీపీ 4th లిస్ట్ రిలీజ్!
వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు.ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
వైసీపీ నాలుగో జాబితా విడుదలైంది. 9 స్థానాల్లో మార్పులు చేర్పులతో ఫోర్త్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు.ఇందులో ఒక ఎంపీ స్థానం ఉండగా.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీరామ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్లు నిరసన చేస్తున్నారు. దాదాపు ఐదు నెలల నుండి తమకు జీతాలు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పొడిగించడం ఇది రెండోసారి. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి.
రాముడు కేవలం 1.5 నిమిషాల్లోనే 14వేల మంది రాక్షసులను చంపిన ప్రాంతం మహారాష్ట్రలోని పంచవటి. ఈ ఆలయంలో 14 మెట్లు ఉన్నాయి. ఇది రాముడి 14 సంవత్సరాల వనవాసాన్ని సూచిస్తుందని చెబుతుంటారు.
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi )నేడు ఆంధ్రప్రదేశ్ లో(AP) ఉమ్మడి అనంతపురం జిల్లాలోశ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల ,మండలం పాలసముద్రం సమీపంలో నాసిన్ అకాడమీని ప్రారంభించారు.
అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం వైసీపీ ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది. తక్షణమే ఆయనను భర్తరఫ్ చేయాలని అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీపీ ఆగడాలకు అంతులేకుండా పోయిందని పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సజ్జల రామకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికేతరుడు కావడంతోనే హిందూపురం అభివృద్ధి జరగలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే స్థానికరాలైనా మహిళా అభ్యర్థిని పోటీలో దింపుతున్నట్లు వెల్లడించారు. హిందూపురంలో గ్రూపు తగాదాల వల్లే వైసీపీ అభ్యర్థులు వరుసగా ఓడిపోతున్నారని కామెంట్స్ చేశారు.