ఏపీ ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగాఎండోమెంట్స్, ఇంధనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు . దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు.
Also Read : దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను..
వాట్సాప్ గవర్నెన్స్‌పై గతేడాది మెటాతో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై రాష్ట్ర సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలి. ఇందులో ఆప్షన్‌లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రవేశ పెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలువనుంది.
Also Read : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
సీఎం కొవ్వూరు పర్యటన రద్దు
ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు అయ్యింది. కాగా 2025 ఫిబ్రవరి1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ఇదే కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.