Andhra Pradesh: పున్నమి చంద్రుడు చంద్రబాబు.. వైసీపీపై నిప్పులు చెరిగిన అచ్చెన్నాయుడు.. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పున్నమి చంద్రుడు అని, ఆయన్ను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇన్ని రోజులు జైల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా సాధించారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు అచ్నెన్నాడు. By Shiva.K 07 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Andhra Pradesh: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పున్నమి చంద్రుడు అని, ఆయన్ను వైసీపీ(YCP) ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని నాయకుడు చంద్రబాబు అని అన్నారు. ఇన్ని రోజులు జైల్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా సాధించారా? అని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు అచ్నెన్నాడు. తెలుగుదేశం పార్టీ కోసం వచ్చిన విరాళాలు, నిధులు విషయంలో ఛాలెంజ్ చేశామన్నారు. టీడీపీకి వచ్చిన ప్రతి పైసాకి లెక్కలు ఉన్నాయని, కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇస్తామన్నారు. వైసీపీ నిన్న, మొన్న పుట్టిన పార్టీ అని, అలాంటి పార్టీకి వందల కోట్లు ఫండ్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. వాటి గురించి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరాన్ని ఒక్క శాతం కూడా పూర్తి చేయలేని దద్దమ్మ పార్టీ వైసీపీ అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించడమే చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఇంత చేసినా.. ఒక్క అవినీతి మరక కూడా చంద్రబాబుకు అంటించలేకపోయారని అన్నారు అచ్చెన్న. దేశ, విదేశాల్లో చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తున్నారని, న్యాయం కొంత ఆలస్యం అయినా.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు. దోపిడీ దారులకు కాలమే తగిన బుద్ధి చెబుతున్నారు. అఖిల ప్రియ ఫైర్.. చంద్రబాబు నాయుడు చేయని తప్పుకు అనవసరంగా జైలుకు పంపించారని మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ అన్నారు. చంద్రబాబు నాయుడు రూ. 3,00 కోట్లు కాదు కదా మూడు రూపాయలు కూడా తీసుకొని ఉండరు అని ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పారు. టిడిపి ప్రభుత్వం ఓటర్ల రీ వెరిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి భయం అనేది పుట్టి చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వైసీపీ పథకాలన్నీ ఎలక్షన్లో పనిచేయవని, ప్రజలకు మీరు ఇచ్చేది వంద రూపాయలు అయితే వాళ్ల దగ్గర నుంచి దోచుకునేది 200 రూపాయలు అని విమర్శించారు. ఏపీలో భూ సర్వే పేరుతో ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 17 ఎకరాలు ఉన్న రైతుకు రీ సర్వేలో రెండు ఎకరాలు చూపిస్తుందన్నారు. ఈ రీ సర్వే అనేది ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుందన్నారు. మూడు రోజుల లోపల ఆళ్లగడ్డ ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ పొలాలను వాళ్లకు చూపిస్తే బాగుంటుందని, లేకపోతే.. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడానికి రెడీగా ఉన్నామని హెచ్చరించారు భూమా అఖిల ప్రియ. రాయలసీమకు తీరని అన్యాయం.. కృష్ణా జలాల పంపిణీలో రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేశారని టీడీపీ నేత బీద రవిచంద్ర యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు కృష్ణా జలాల పంపిణీ పై ఏనాడూ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని విమర్శించారు. న్యాయమైన వాటా కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ను ఎడారిగా మార్చాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో ఏపీ కి 512 టీఎంసీల నీరు కావాలని 2015 లో కోరి తెచ్చిన చంద్రబాబు.. రాయలసీమ ద్రోహి ఎలా అవుతాడు? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా నోరు విప్పని జగన్ రెడ్డి రాయలసీమకు నిజమైన ద్రోహి అని వ్యాఖ్యానించారు. Also Read: TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు.. అసలు ఏం అయిదంటే..? #andhra-pradesh #chandrababu-naidu #tdp #chandrababu-arrest #tdp-leaders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి