Disha App: అదే పనిచేసి ఉంటే అమ్మాయిపై అఘాయిత్యం జరిగేదా? అనిత సంచలన కామెంట్స్..

దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురానందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు టీడీపీ నాయకురాలు అనిత. దిశ యాప్ పని చేసి ఉంటే విశాఖలో బాలికపై అత్యాచారం జరిగేదా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్నారు అనిత.

New Update
Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్

Andhra Pradesh: దేశంలోనే అత్యధికంగా మహిళలపై దాడులు జరిగిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, ఇందుకు కారణం వైసీపీ(YCP) ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ(TDP) నాయకురాలు వంగలపూడి అనిత(Anitha). మంగళవారం మీడియాతో మాట్లాడిన అనిత.. పొట్ట చేత పట్టుకుని విశాఖ(Vizag)కు వచ్చిన ఓ దళిత కుటుంబానికి చెందిన 11 మంది చేతిలో అత్యాచారానికి గురైందన్నారు. ఇంత జరిగితే మహిళా కమిషన్ చర్యలు మాత్రం శూన్యం అని విమర్శించారు. సుమోటోగా తీసుకున్నానని అని ఆదేశిలివ్వడం మినహా వారు చేసిందేమీ లేదని విమర్శించారు. బాధిత బాలికను మహిళా కమిషన్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు అనిత. మహిళా హోం మంత్రి ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వైసీపీ మంత్రులు సీట్లు మార్చే సరికి ముందే పదవి అయిపోయిందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎందుకు సమాచారం చెప్పడం లేదని ప్రశ్నించారు అనిత. రాష్ట్రంలో క్రైమ్స్‌పై డీజీపీ తప్పుడు లెక్కలు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని గొప్పలు చెప్తున్నారని అన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 25వేల నేరాలు జరిగాయని.. కానీ, జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.48 లక్షల నేరాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందే చెప్పారని అనిత గుర్తు చేశారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 40 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయని అన్నారు. మాట్లాడితే దిశ పేరు చెప్పి.. బాధిత కుఉటంబానికి ఇంకా బాధపెడుతున్నారని ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ కంటే ముందు జగన్ వస్తాడని సినిమా డైలాగ్స్ కొట్టడం తప్ప వారు చేసేదేమీ లేదని విమర్శించారు అనిత. దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురానందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. దిశ యాప్ పని చేసి ఉంటే.. ఆ బాలిక మీద అత్యాచారం జరిగేదా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నాయకురాలు అనిత.

Also Read:

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు..

వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan : జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!

జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  

New Update
jagan-si-sudhakar

jagan-si-sudhakar

ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్‌ఐ సుధాకర్‌ ఓ వీడియో విడుదల చేశారు.  ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..  ‘జగన్‌.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? అని ప్రశ్నించారు.  కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది అని చెప్పుకొచ్చారు.

ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు

మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతామన్న సుధాకర్..   నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కమని తెలిపారు.  జగన్.. జాగ్రత్తగా మాట్లాడాలి.. జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ సుధాకర్‌ హెచ్చరించారు. ఇక  గతనెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు.  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు.

మాజీ సీఎం జగన్ అనుచరులు..  తమ దగ్గర గన్ లు ఉన్నాయని.. ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొడుతున్నారని.. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్..ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

 

 

Advertisment
Advertisment
Advertisment