తిరుపతి హృదయాలయ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ఏపీలోని తిరుపతి శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సదుపాయాలను దగ్గరుండి వైద్య సిబ్బందిని దగ్గరుండి ఆస్పత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

New Update
తిరుపతి హృదయాలయ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రమంత్రి గడ్కరీ

andhra-pradesh-news-union-minister-gadkari-visited-tirupati-hrudayalaya-hospital

తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సందర్శించారు. గురువారం ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఈ ఆస్పత్రి కలిగి ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. అంతేకాదు ఇలాంటి వైద్యసదుపాయాలను దేశమంతటా విస్తరించాలని ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ఆస్పత్రి ఉందని హర్షం

గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు కేవలం మెట్రో నగరాలైన ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవని ఆయన అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు దాదాపు 1600 గుండె సంబంధిత శస్త్రచికిత్సలు ఉచితంగా చేశారని, దీన్ని భగవంతుని సేవగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా అవయవ మార్పిడికి సంబంధించిన డాక్టర్ల కొరత ఉందని, మరింత మందికి శిక్షణ అవసరమని శిక్షణనంతరం వారందరూ కూడా ఇలాంటి సేవలో పాల్గొనాలని కోరారు.

హృదయాలయ ఆసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశీలించిన గడ్కరీ

తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలోని ఐసీయూ, ఔట్‌ పేషెంట్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఆయన వెంట టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి ఈ.వో ఎవి. ధర్మారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, ఈ.ఈ కృష్ణారెడ్డి, ఆర్‌.ఎం.ఓ డాక్టర్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు. రానున్న అత్యాధునిక హంగులతో ఈ ఆస్పత్రి రూపుదిద్దుకోవాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ సేవలకు గానూ తనకెంతో గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు