ఏపీకి బిగ్ అలర్ట్, మరో మూడురోజుల్లో రాష్ట్రానికి భారీ వర్షసూచన గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.. తెలంగాణలో మాత్రం రోజు వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనపై మరో అప్డేట్ ను అందించారు. By Shareef Pasha 15 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని ఏపీ వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో ఆవర్తనం.. 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల కారణంగా కోస్తాతో పాటు సీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. కామవరం దగ్గర గుబ్బల మంగమ్మ గుడి రహదారి మూసివేశారు అధికారులు. ఉత్తర కోస్తా, యానాం లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక కోనసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇకపోతే ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు మందగించాయి. చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూసే పరిస్థితు లు ఏర్పడ్డాయి. దాంతో.. వర్షాలు కురవాలంటూ జనం పూజలు చేస్తున్నారు.. కర్నూలు, కడప వంటి ప్రాంతాల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన చిరుజల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురుస్తాయంది. దక్షిణ కోస్తాంద్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. అలాగే ఉరుములు, మెరుపులు ఒకట్రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి