ఏపీలో వింత వ్యాధి, ఏకంగా 70 రోజులు అలా! ఏపీలో ఓ అరుదైన వింత వ్యాధి వెలుగు చూసింది. అదొక గులియన్-బారే సిండ్రోమ్. ఈ వ్యాధి ప్రపంచంలో అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. రాయగడకి చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడగా, ఆయన్ను విశాఖకు తీసుకొచ్చారు. రోగి శరీరంలో కేవలం కళ్లు తప్ప, ఏ అవయవం కదపలేని స్థితిలో ఉన్నారు. గుండె, నాడీ కూడా 30కి పడిపోయింది. By Shareef Pasha 20 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి విశాఖలో తాజాగా ఓ అరుదైన వ్యాధి బయటకొచ్చింది అదే.. గులియన్-బారే సిండ్రోమ్. ఈ వ్యాధి ప్రపంచంలో అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. రాయగడకి చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడగా.. ఆయన్ను విశాఖకు తీసుకొచ్చారు. రోగి శరీరంలో కేవలం కళ్లు తప్ప.. ఏ అవయవం కదపలేని స్థితిలో ఉన్నారు. గుండె, నాడీ పూర్తిగా పడిపోయింది. దాదాపు ఆ వ్యక్తి చనిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ.. వైద్యులు ఓటమిని అంగీకరించలేదు. అలాంటి స్థితిలో ఉన్న ఆ రోగిని.. మెరుదైన అందించి కాపాడారు. అయితే.. ఈ ప్రాసెస్ అంత సులువుగా సాగలేదు. ఏకంగా 70 రోజుల పాటు వైద్యం అందించి.. వైద్యులు ఆ రోగిని కాపాడారు. ఇంతకి గులియన్-బారే సిండ్రోమ్ ఏంటి? ఇది నరాలను ప్రభావితం చేసే అరుదైన వ్యాధి. మనల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచే రోగ నిరోధక వ్యవస్థే.. నరాల మీద దాడి చేసి తిమ్మిరి, బలహీనత, నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సెన్సేషన్ త్వరగా శరీరం మొత్తం పాకి.. చివరికి పక్షవాతంకు దారి తీస్తుంది. ఈ పరిస్థితికి గల కారణాలేంటో ఇప్పటికీ తెలియదు కానీ.. చాలా మంది రోగులు శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వైరల్ సంక్రమణను గురైనట్టు తెలిపారు. ఈ వ్యాధి రావడానికి గల కారణాలు? శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వైరల్ సంక్రమణ తర్వాత.. ఈ వ్యాధి రోజులు లేదా వారాల వ్యవధిలో కనిపిస్తుంది. జికా వైరస్ లేదా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికల్లో తేలింది. సాధారణంగా.. మన ఆరోగ్యంపై దాడి చేసే వైరస్లపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. కానీ.. ఈ వ్యాధి బారిన పడినప్పుడు మాత్రం ఆ వ్యవస్థ నరాలపై దాడి చేసి.. బలహీనత, పక్షవాతం గురయ్యేలా చేస్తుంది. ఇది కాళ్ళలో జలదరింపు, బలహీనతతో ప్రారంభమవుతుంది. మెల్లగా శరీరం పై భాగాలకు వ్యాపిస్తుంది. క్రమంగా ఈ వ్యాధి శరీరం మొత్తం వ్యాపించి.. పక్షవాతంగా మారుతుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి