AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..?

నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

New Update
AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..?

Robberies  In Nandyal : నంద్యాల (Nandyal) లో దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. రాయమాల్పురం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్దురాలైన సర్పంచ్ ఇంట్లోకి చొరబడి హల్ చల్ చేశారు. సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసిన ముసుగు దొంగలు..ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: ఏపీలో మరో భారీ ప్రమాదం..!

ఇంట్లోని సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియా (Social Media) లో వైరల్ గా మారాయి. ముసుగు దొంగల వీడియో చూసి పట్టణ శివారు ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు.

New Update
Tenth results

Tenth results

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. 


100 శాతం ఫలితాలు సాధించిన 1680 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇందులో అబ్బాయిలు 78.31 శాతం పాస్ కాగా.. అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం వెబ్‌సైట్ మాత్రమే కాకుండా వాట్సాప్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసినా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment