Agri Gold Land Case : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. జోగి రాజీవ్ కు బెయిల్!
మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి ఆయన జైలులో ఉండగా.. ఎట్టకేలకు బెయిల్ లభించింది.
Jogi Rajeev : అగ్రిగోల్డ్ భూమల కేసు (Agri Gold Land Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జోగి రాజీవ్ కు కండిషన్ బెయిల్ ఇవ్వడంతో ఆయన విజయవాడ జిల్లా జైల్ నుండి విడుదల అయ్యారు.
తన పాస్ పోర్ట్ ఏసీబీ స్టేషన్ లో సబ్మిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి నెల రెండో శనివారం స్థానిక ఏసీబీ స్టేషన్ లో సంతకం పెట్టాలని చెప్పారు. కేసుకు సంబంధించి మీడియాతో ఎక్కడ మాట్లాడవద్దని హెచ్చరించారు.
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఆగస్టు 13న జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను జోగి రాజీవ్ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
Tirumala High Alert : పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు.
Tirumala High Alert : జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమతిలోనూ హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్! కొండపై సెక్యూరిటీ కట్టుదిట్టం చేసినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైతం వదలకుండా తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమలలో కూడా భద్రత కట్టుదిట్టం చేసింది.
తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు.. దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో తిరుమలలో భద్రతలను కట్టుదిట్టం చేశామన టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు ఆక్టోపస్ దళం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి.. భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆక్టోపస్ టీమ్ తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా, భద్రతా, సివిల్ పోలీసులకు, రిజర్వు పోలీసులకు, ఆలయ సిబ్బందికి, వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరిస్తారు. గతేడాది మార్చిలో తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే తిరుమల ఆలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.. 24 గంటలు సాయుధ బలగాల పహారాలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. మొత్తం మీద కాశ్మీర్ ఉగ్రదాడి ప్రభావం తిరుమలపై కూడా కనిపించింది.. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యల్లో భాగంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.