IT Notice to Chandrababu: ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుకు షాక్.. రంగంలోకి సీఐడీ..!

ఐటీ స్కామ్‌తో పాటు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ వ్యవహారంలో నాటి సీఎం, నేటి విపక్ష నేత చంద్రబాబుకే ముడుపులు వెళ్లాయని ఆరోపిస్తూ మనోజ్ వాసుదేవ్, ఉమేష్ గుప్తాకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

New Update
IT Notice to Chandrababu: ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుకు షాక్.. రంగంలోకి సీఐడీ..!

IT Notice to Chandrababu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత చంద్రబాబుకు(Chandrababu Naidu) ఇబ్బందులు తప్పవా? ఐటీ నోటీసుల(Income Tax Department) వ్యవహారంలో ఆయనకు ఉచ్చు బిగుస్తోందా? ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు మరో విచారణ సంస్థ కూడా ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ వ్యవహారంపై దృష్టి పెట్టిందా? అంటే వాస్తవ పరిస్థితులు అవుననే చెబుతున్నారు. చంద్రబాబు ఐటీ ఎపిసోడ్‌లోకి ఏపీ సీఐడి(Andhra Pradesh CID) ఎంట్రీ ఇచ్చింది. ఐటీ స్కామ్‌తో పాటు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ వ్యవహారంలో నాటి సీఎం, నేటి విపక్ష నేత చంద్రబాబుకే ముడుపులు వెళ్లాయని ఆరోపిస్తూ మనోజ్ వాసుదేవ్, ఉమేష్ గుప్తాకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్కామ్‌లలోనూ చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో చంద్రబాబు పాత్ర ఉందన్న కోణంలో ఏసీ సీఐడీ విచారణకు సిద్ధమైంది. ఈ ముడుపుల వ్యవహారాన్ని తేల్చేందుకు, చంద్రబాబు పాత్ర ఏంటో నిర్ధారించేందుకు సీఐడీ తన విచారణలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. మరి ఈ ఐటీ నోటీసుల వ్యవహారంలోకి సీఐడీ ఎంట్రీపై టీడీపీ బాస్, ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

రైతులతో చంద్రబాబు సమావేశం.. 

చంద్రబాబు పాపం పండింది..

చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎక్స్‌పైరీ లీడర్ అంటూ కామెంట్స్ చేశారు. 'ఆయన వయసు అయిపోయింది. శక్తి తగ్గింది. ఆయన పని అయిపోయింది. చంద్రబాబుకు మిగిలింది ఒక్కటే. ఆయన చేసి పాపాలకు, వెన్నుపోట్లకు, దుర్మార్గాలకు పాపపరిహారం చెల్లించుకోవాల్సిన సమయం మాత్రమే మిగిలి ఉంది.' అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు ఐటీ నాలుగు నోటీసులు జారీ చేసిందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు ఎమ్మెల్యే అనిల్.

Also Read:

Thummala Nageswara: కాంగ్రెస్‌లోకి తుమ్మల చేరికకు బ్రేక్.. పార్టీ మారుతారా?

Balagam Movie: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..

Advertisment
Advertisment
తాజా కథనాలు