Andhra Pradesh Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బాబు అరెస్ట్ నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. By Shiva.K 21 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Assembly Sessions 2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. కాగా, ఉదయం 8.30కి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి అసెంబ్లీకి బయలుదేరనున్నారు టీడీపీ (TDP) సభ్యులు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అక్రమం అంటూ సభలో గళం వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. మరోవైపు చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అధికార వైసీపీ పార్టీ (YSRCP). పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఈ సెషన్ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దేవాదాయ చట్టంలో సవరణలు చేసే బిల్లును మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ఆధార్ బిల్లు ను మంత్రి అమర్నాధ్ (Minister Amarnath) ప్రవేశపెట్టనున్నారు. ఏపీవీవీపీ ని రద్దు చేసే బిల్లును ను మంత్రి రజిని ప్రవేశపెట్టనున్నారు. అలాగు మంత్రి ధర్మాన.. అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణలు చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. జీఎస్టీ సవరణ బిల్లును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ (CM Jagan) ముందస్తు ఎన్నికలకు వెళతారని ఊహాగానాలు గట్టిగానే ప్రచారం అవుతున్నాయి. ఈ నేపత్యంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండగా.. తాజాగా ఈ ప్రచారంపై మంత్రి అమర్ నాథ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరి మరి అమర్ నాథ్ ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడాల్సిందే.. Also Read: BIG BREAKING: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం..! T20 World Cup 2024 Venues: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌పై కీలక ప్రకటన #chandrababu-arrest #andhra-pradesh-news #ap-ex-cm-chandrababu #andhra-pradesh-cm-ys-jagan #andhra-pradesh-assembly-sessions-2023 #ap-assembly-sessions-2023 #andhra-pradesh-assembly-live మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి