Anchor Sreemukhi: శ్రీముఖి రేంజ్ మారింది.. ఏకంగా స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో..

టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ పాన్ ఇండియా మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ , అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ చెల్లిగా శ్రీముఖి నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

New Update
Anchor Sreemukhi: శ్రీముఖి రేంజ్ మారింది.. ఏకంగా స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో..

Anchor Sreemukhi: శ్రీముఖి.. ఈ ముద్దు గుమ్మ తన మాట తీరు, కామెడీ టైమింగ్, చలాకీతనంతో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెర పై టాప్ యాంకర్స్ లో ఒకరిగా సాగుతోంది. బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో మరింత సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. పలు టీవీ షోలు ఈవెంట్స్ తో  బిజీగా ఉంటూనే.. ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో అలరిస్తోంది.

Also Read: Kumari Aunty: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!

Anchor Sreemukhi

అల్లు అర్జున్ - శ్రీముఖి కాంబో

అయితే ఇటీవలే భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ సరసన మెరిసిన శ్రీముఖి.. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టు లో యాంకర్ శ్రీముఖి అల్లు అర్జున్ చెల్లిగా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 8th అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సినిమా పై అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని   టాక్.

Anchor Sreemukhi

'జులాయి' సినిమా

గతంలో శ్రీముఖి, అల్లు అర్జున్ 'జులాయి' సినిమాలో అన్నా చెల్లెల్లు గా నటించి మెప్పించారు. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబో రిపీట్ కానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక టీవీ షోస్, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ కనిపించే ఈ ముద్దు గుమ్మ.. తన హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతూ ఉంటుంది.

Also Read: Save The Tigers Series: ఓటీటీలో ‘సేవ్‌ ది టైగర్స్‌’ హవా .. ఇండియాలోనే టాప్ 3 సీరీస్ గా రికార్డు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు