Anchor Shyamala : గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..!

గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు సినీ యాంకర్ శ్యామల. నూటికి నూరు శాతం కొడాలి నానినే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో నేడు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.

New Update
Anchor Shyamala : గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..!

Anchor Shyamala : విజయవాడ(Vijayawada) నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని, సినీ యాంకర్ శ్యామల(Shyamala) విస్తృతంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. గ్రామంలో వీధి వీధినా ఎమ్మెల్యే కొడాలి నాని.. యాంకర్ శ్యామలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుట్టగుంట గ్రామంలో గడపగడప ప్రచారం చేశారు. సీఎం జగన్ కు మద్దతుగా.. ఎమ్మెల్యే కొడాలి నానిను గెలిపించాలంటూ ఓటర్లకు శ్యామల విజ్ఞప్తి చేశారు.

Also Read: మంత్రి బొత్స వ్యాఖ్యలకు పురంధేశ్వరి మాస్ కౌంటర్..!

ప్రచారంలో భాగంగా యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఎన్నికల ప్రచారం చూస్తుంటే తనలో ఎంతో ఉత్సాహం నింపిందని, ప్రతి ఇంట్లో ఆయనను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారన్నారు. గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదని.. నూటికి నూరు శాతం గెలిచేది కొడాలి నానినే నని శ్యామల చెప్పారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో నేడు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. కొడాలి నాని ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే.. ఆయన ఎంత గొప్పవాడొ అర్థమవుతుందని శ్యామల అన్నారు.

Also Read: నెల్లూరులో రచ్చ..రచ్చ…పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..!

ప్రజల సమస్యల పరిష్కారానికి నిజమైన లీడర్ లా కొడాలి నాని(Kodali Nani) కష్టపడుతున్నారన్నారు. నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం.. సీఎం జగనన్న ఎంతవరకైనా వెళ్తారని.. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారని.. ఎంతమంది వచ్చినా అడ్డుకుంటారని శ్యామల పేర్కొన్నారు. మే 13వ తేదీన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు తమ రెండు ఓట్లు వేసి.. మనకోసం నిలబడే నిజమైన లీడర్లను గెలిపించుకోవాలని యాంకర్ శ్యామల పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.

New Update
Andhra Pradesh Secretariat second block VK

Andhra Pradesh Secretariat second block VK

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

పవన్ పేషీలో మంటలు

కాగా సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

Advertisment
Advertisment
Advertisment