AP: రసాభాసగా జిల్లా సర్వసభ్య సమావేశం.!

అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

New Update
AP: రసాభాసగా జిల్లా సర్వసభ్య సమావేశం.!

Ananthapuram: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరిగిన అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ఇవాళ ఉదయం జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒకరు మినహా జడ్పీటీసీలు మొత్తం వైసీపీ వారే ఉండటం, ఎమ్మెల్యేలంతా టీడీపీ వారు ఉండటం సర్వత్రా ఆసక్తి రేపింది. పలు అంశాల పై జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు.

Also read: ఒలింపిక్ క్రీడలకు పేదింటి బిడ్డ దండి జ్యోతిక శ్రీ.. తండ్రి ఎమోషనల్..!

గతంలో తీర్మానాలు చేసిన వాటిని తేల్చిన తర్వాతనే సమావేశం ప్రారంభించాలని జడ్పీటీసీ లు డిమాండ్ చేశారు. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. మరోవైపు 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ఫిల్టర్ వాటర్ ప్లాంట్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టారన్నారు.

నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సృజల స్రవంతి వాటర్ ప్లాంట్లను ఉపయోగంలోకి తేవాలని మరమ్మత్తులు చేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు కోరారు. పింఛన్ ను వాలంటీర్లతో పంపిణీ చేయలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించడంతో.. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు స్పందిస్తూ ప్రభుత్వ లక్ష్యం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం అన్నారు. మీ పార్టీకి చెందిన వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయమని మీరు ఎలా చెబుతారని.. ఇకపై వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయడం జరగదు అని బదులిచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Venkaiah Naidu: రాజకీయం ఓ బూతు.. తిరుమల సాక్షిగా వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు!

రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారంటూ  తిరుపతి మేధావుల సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వికసిత్ భారత్ వైపు నడవాలని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.

New Update
Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బూతులు మాట్లాడే నేతలు ఎక్కువయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలందరినీ ప్రజలు ఇంటికి పంపించారని, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన వారిని ఘోరంగా ఓడించారని చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన మేధావుల సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ లతోనే ప్రజలు సమాధానం చెబుతున్నారని, తుపాకీతో భయపెట్టాలని చూసిన వారు ఆ తుపాకీకే బలయ్యారని గుర్తు చేశారు. 

ప్రజల్లోను మార్పు రావాలి..

ఎన్నికలంటే ప్రజల్లోను మార్పు రావాలి. ఉచితమని ప్రకటన చేసే ప్రతి పార్టీని ప్రశ్నించాలి. ఉచితం అనుచితానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. విద్య, వైద్యంను ఉచితంగా ఇస్తే తప్పేమీ లేదు. ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, ప్రాంతాలకే ప్రాధాన్యత పెరిగింది. వచ్చే ఎన్నికల్లో అవేమీ ఉండకూడదు. నేను ఏ రోజు జేబులో నుంచి రూపాయి తీయలేదు. రూపాయి వేసుకోలేదు. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి వెళ్లాలనుకుంటే ఉన్న పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని సూచించారు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఇక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమగ్రంగా మార్చాలన్నారు. భారతదేశం వికసిత్ భారత్ వైపు నడవాలని, అందుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నాలుగుసార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నికను సిఫార్సు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఒకే ఎన్నికను తీసుకురావడం లేదన్నారు. ఎప్పటి నుంచో ఒకే ఎన్నిక విధానం ఉందని, ఒకేసారి దేశంలో ఎన్నికలు జరిగితే 12వేల కోట్ల రూపాయలు మిగులుతాయని తెలిపారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

venkayya-naidu | tirupathi | telugu-news  today telugu news venkaiah-naidu 

Advertisment
Advertisment
Advertisment