Ananth Ambani: ఈ షేర్వానీ డిజైన్ చేయడానికి అన్ని రోజులు పట్టిందా..!

అంబానీ పెళ్లి వేడుకల్లో అనంత్ అంబానీ ధరించిన రెడ్ కలర్ షేర్వానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ షేర్వానీ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని పై శతాబ్దాల నాటి పిచ్వాయ్ పెయింటింగ్ వేయబడింది. ఈ షేర్వానీ పై డిజైన్ చేసిన బంగారు ఆకులను చేతితో చిత్రీకరించారు.

New Update
Ananth Ambani: ఈ షేర్వానీ డిజైన్ చేయడానికి అన్ని రోజులు పట్టిందా..!

Ananth Ambani: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జులై 12న అనంత్- రాధికా మూడు ముళ్ళ బంధంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అంబానీ పెళ్లి వేడుకలు కని విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ లో వధూవరులు అనంత్ రాధికా ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంబానీ కుటుంబం అంతా ప్రత్యేక వస్త్రాలంకారణలో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే తాజాగా డిజైనర్ మనీష్ మల్హోత్రా వరుడు అనంత్ అంబానీకి ధరించిన రెడ్ కలర్ షేర్వానీకి సంబంధించిన ప్రత్యేక వివరాలను పంచుకున్నారు.

అనంత్ అంబానీ షేర్వానీ ప్రత్యేకతలు

అనంత్ అంబానీ కోసం తయారు చేసిన ఈ షేర్వానీలో బంగారు ఆకులతో చక్కటి చేతి పెయింటింగ్ తో డిజైన్ చేయబడింది. భిల్వారా కళాకారులచే 600 గంటల్లో తయారు చేయబడింది. ముగ్గురు నిపుణులైన పిచ్వాయి కళాకారులు 110 గంటలలో అంటే 4 రోజుల కంటే ఎక్కువ సమయంలో షేర్వానీ పై ఉన్న బంగారు ఆకులను చిత్రీకరించారు. ఈ షేర్వాణిపై శతాబ్దాల నాటి పిచ్వాయ్ పెయింటింగ్ వేయబడింది. ఇది నిజమైన బంగారు పొరను ఉపయోగించి బంగారు రంగులో తయారు చేయబడింది.

ఈ పిచ్వాయ్ పెయింటింగ్ ఏమిటి?

పిచ్వాయ్ పెయింటింగ్ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వార్ ఆలయంతో ముడిపడి ఉంటుంది. ఈ పెయింటింగ్‌లో శ్రీకృష్ణుడు, ఆవు, పువ్వులు, ఆకులు చెక్కబడ్డాయి. ఈ పెయింటింగ్ చరిత్ర 17వ శతాబ్దం నుంచి మొదలవుతుంది.

Also Read: Mechanic Rocky: విశ్వక్‌ సరసన కోలీవుడ్ బ్యూటీ.. ‘మెకానిక్‌ రాకీ’ అప్డేట్ ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు