/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/man-1-jpg.webp)
NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పుష్ప-3(Pushpa-3) సినిమాను ముందే చూపించాడు ఓ ముసలోడు. కోదాడ నుండి నందిగామకు స్కూటీలో పుష్ప సినిమాను తలపించేలా మద్యంను తరలిస్తున్నాడు. స్కూటీని ఏకంగా మద్యం షాపుగా మార్చేశాడు. తెలంగాణ(Telangana) నుండి ఆంధ్రా(Andhra Pradesh) కు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మద్యంని నందిగామ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
Also Read: ముదిరిన మూఢ నమ్మకం.. పాము కాటుకు చనిపోయిన వ్యక్తిని గంగా నది ప్రవాహంలో వేలాడదీసి…!
నందిగామ ఏసీపీ రవికిరణ్(ACP Ravi Kiran) మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల(General Elections) నేపథ్యంలో భద్రత కట్టుదట్టం చేశామన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా స్కూటీ ద్వారా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో నందిగామ సీఐ హనీఫ్ వారి సిబ్బంది స్కూటీని స్వాధీనం చేసుకున్నారన్నారు. అందులో 100 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.