Amul Milk Price Hike: అమూల్ పాలు.. రేటు మారింది.. ఎంత పెరిగిందంటే..

గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ అమూల్ పాల ధరను దేశవ్యాప్తంగా పెంచింది. లీటరుకు 2 రూపాయల మేర ధరలను పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ధరల పెంపుదల ఈరోజు నుంచే అంటే  జూన్ 3 నుంచే అమలులోకి వచ్చింది. 

New Update
Amul Milk Price Hike: అమూల్ పాలు.. రేటు మారింది.. ఎంత పెరిగిందంటే..

Amul Milk Price Hike: ఎన్నికలు ముగిశాయి. క్రమంగా ధరల పెరుగుదల ప్రారంభం అవుతోంది. గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) అమూల్ పాల ధరలను పెంచింది. ఈసారి లీటరుకు రూ.2 చొప్పున పెంచారు. సోమవారం ఉదయం నుంచి అంటే జూన్ 3 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి, పాలకు లీటరుకు రూ.2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Amul Milk Price Hike: ఈ ధరల పెంపుదల అమూల్ గోల్డ్, అమూల్ తాజ్, అమూల్ శక్తి మూడు రకాల పాలకు పెరిగింది. . ఒక్క అమూల్ తాజా నానా పౌచ్ ధరల్లో మాత్రమే ఎలాంటి పెంపుదల లేదు. అంటే పాత ధరలకే ఈ పాలు లభిస్తాయి. ఈ పెరుగుదల మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి అమలులోకి తెచ్చింది అమూల్. ఇప్పుడు అమూల్ పాలు చాలా ఖరీదైనవి

Amul Milk Price Hike: అమూల్ కొత్త ధరల ప్రకారం అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్ ఇప్పుడు రూ.32 నుంచి రూ.33కి పెరిగింది. అమూల్ తాజా 500 ఎంఎల్ ధర రూ.26 నుంచి రూ.27కి పెరిగింది. అమూల్ శక్తి 500 ఎంఎల్ ఇప్పుడు రూ.29 నుంచి రూ.30కి పెరిగింది. అముల్ తాజా చిన్న ప్యాకెట్లు మినహా అన్ని పాల ధరలను లీటరుకు రూ.2 పెంచారు. అమూల్ గోల్డ్ 500 ml ప్యాక్ ఇప్పుడు రూ. 33కి అందుబాటులో ఉంటుంది. అమూల్ శక్తి ప్యాక్ రూ.30కి, అమూల్ తాజా రూ.27కి అందుబాటులో ఉంటాయి.

Also Read: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు.. వారికి మాత్రమే!

Amul Milk Price Hike: అంటే ఎన్నికలకు ముందు లీటరు పాలకు రూ.64 ఉన్న ప్రజలు ఇప్పుడు రూ.66 చెల్లించాల్సి వస్తోంది. ఈ పెరిగిన పాల ధర సామాన్యుల బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పుడు మరో ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలపై పడబోతోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ పాల ధరలు పెరగడం వారికి పెద్ద సమస్యగా మారనుంది.

ఇందుకే ధరలు పెరిగాయి
GCMMF చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పాల ధరను పెంచింది. రైతులు తమ పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేసేందుకు ఈ పెంపు అవసరమని కంపెనీ చెబుతోంది. లీటరుకు రూ.2 పెరగడం అంటే 3-4 శాతం ఎంఆర్‌పి పెరుగుదల, ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువ అని కంపెనీ అంటోంది. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు