సమూలంగా చట్టాల మార్పుకు సిద్ధమైన కేంద్రం : నేడు పార్లమెంటులో బిల్లు

BIg Breaking మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్మాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. బ్రిటిషు కాలం నుంచి అమలులో ఉన్న చట్టాలకు కొత్త పేర్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.

New Update
సమూలంగా చట్టాల మార్పుకు  సిద్ధమైన కేంద్రం : నేడు పార్లమెంటులో బిల్లు

Amit Shah Introduces 3 New Bills (IPC,CRPC, Indian Evidence Act) : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చివరి రోజయిన శుక్రవారం కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది.ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టులలో మార్పులను ప్రతిపాదించే మూడు బిల్లులను హోం మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. భారతీయ నాగరిగ్ సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు పేరుతో ఉన్న ఈ బిల్లులను స్టాండింగ్ కమిటీ కి పంపుతున్నారు. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని భావిస్తున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు. సత్వర పరిష్కారం, భారతీయ పౌరుల గుర్తింపు కోసమే చట్టంలో మార్పులు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

వాటి పేర్ల మార్పు

IPC బదులుగా భారతీయ నాగరిగ్ సురక్ష సంహిత
CRPC బదులుగా భారతీయ న్యాయ సంహిత
ఎవిడెన్స్‌యాక్టు బదులు గా భారతీయ సాక్ష్య బిల్లు

క్రిమినల్ శిక్షల్లోనూ భారీగా మార్పులు

గ్యాంగ్‌ రేప్‌కు 20ఏళ్ల జైలు శిక్ష
మూకదాడులకు 7 ఏళ్లు జైలు
మైనర్ల అత్యాచరం కేసుల్లో ఇక మరణశిక్ష

క్రిమినల్ ప్రొసీజర్‌లో మొత్తం 313 మార్పులు
ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ఛాన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు