US లో ఇద్దరు మహిళలను హత్యచేసిన వ్యక్తికి 226 ఏళ్ల జైలు శిక్ష! అమెరికాలో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఓ వ్యక్తికి 226 ఏళ్ల జైలు శిక్ష పడింది.దక్షిణాఫ్రికాకు చెందిన స్మిత్ అలాస్కాకు చెందిన కాథ్లీన్ హెన్రీ, వెరోనికాను 1996లో హత్యచేశాడు. అయితే ఓ సెక్స్ వర్కర్ స్మిత్ కారు నుంచి ఫోన్ చోరీ చేయగా ఈ ఉదంతం 2019లో బయటపడింది. By Durga Rao 14 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి దక్షిణాఫ్రికాకు చెందిన బ్రియాన్ స్టీవ్ స్మిత్, అలస్కా రాష్ట్రంలో నివసిస్తున్న US పౌరుడు. ఓ సెక్స్ వర్కర్ స్మిత్ కారులో నుంచి తన మొబైల్ ఫోన్‌ను దొంగిలించగా, అందులో ఉన్న ఫోటోలు, వీడియోలను బట్టి స్మిత్ ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది. ఓ సెక్స్ వర్కర్ మహిళ ఫిర్యాదు మేరకు 2019లో స్మిత్‌ను అరెస్టు చేశారు. విచారణలో, అలాస్కాకు చెందిన కాథ్లీన్ హెన్రీ (30), వెరోనికా అబుచుక్ (52)లను చంపినట్లు స్మిత్ అంగీకరించాడు. అలాస్కాలోని ఎంకరేజ్‌లోని ఓ హోటల్‌లో కాథ్లీన్ హెన్రీని దారుణంగా హత్య చేసి పాతిపెట్టాడు.అదేవిధంగా భార్య ఇంట్లో లేని సమయంలో వెరోనికాను తీసుకెళ్లిన స్మిత్ ఆమెను కాల్చి పాతిపెట్టాడని కూడా తేలింది. గత ఐదేళ్లుగా అలస్కా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై నిన్న తీర్పు వెలువడింది.స్మిత్ దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, ఇద్దరు మహిళలకు హత్యలకు 99 సంవత్సరాల జైలు శిక్ష విధించంది.అత్యాచారం, సాక్ష్యాలను దాచినందుకు సహా మొత్తం 226 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు అతనికి వేసింది. #america-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి