Zero FXE electric bike: సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి నాగార్జున్ సాగర్.. మార్కెట్లోకి అదిరే ఎలక్ట్రిక్ బైక్!

అమెరికాకు చెందిన టూ వీలర్ తయారీ సంస్థ జీరో మోటార్స్, హీరో సంస్థతో కలిసి ఈవీ బైక్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ బైక్ గంటకు 136 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే 170 కి.మీ ప్రయాణించవచ్చని తయారీదారులు చెబుతున్నారు.

New Update
Zero FXE electric bike: సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి నాగార్జున్ సాగర్.. మార్కెట్లోకి అదిరే ఎలక్ట్రిక్ బైక్!

Zero FXE electric bike: త్వరలో భారత ఎలెక్ట్రిక్ వాహనాల రంగంలో మరో విదేశీ కంపెనీ అడుగుపెట్టనుంది. అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్ కంపెనీ త్వరలో భారత్ లో తమ ఎలెక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం హీరో మోటార్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. భారత రోడ్ల ఆధారంగా వాహనాలను రూపొందించేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇంపోర్ట్ టాక్స్ ఎక్కువ ఉండడం వల్ల భారత్ లోనే తమ వాహనాలను తాయారు చేసేందుకు.. తయారీ కేంద్రం ఏర్పాటు కోసం హీరో మోటో కార్ప్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇంధన ధరలతో ఇక్కట్లు..

ఇప్పుడిప్పుడే భారత్ లో ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఇంధనంధరలు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చు పెరగడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ వాహనాలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈవీ వాహనాలకు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అవ్వడమే. కాగా ఇప్పటికే ఈవీ రంగంలోకి అనేక కంపెనీలు అడుగుపెట్టాయి. టాటా, మహేంద్ర, హ్యుండై, కియా వంటి టాప్ కంపెనీలు ఈవీ రంగంలో రాణిస్తున్నాయి. అలాగే ద్విచక్ర వాహనాల రంగంలోకి ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ వంటి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి . టాప్ సెల్లింగ్ లో ఓలా, ఎథర్ కంపెనీల వాహనాలు ఉన్నాయి.

ఒక్క ఛార్జీతో 170 కిమీ..

తాజాగా జీరో మోటార్ సైకిల్ కంపెనీ హీరో మోటో కార్ప్ కంపెనీతో కలిసి కొత్త ఈవీ ద్విచక్ర వాహనాన్ని రెడీ తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు జీరో ఎఫ్ఎక్స్ఈ గరిష్ట వేగం గంటకు 136 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే దీని రైడింగ్ రేంజ్ గంటకు 170 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉదాహరణకు హైదరాబాద్ టూ నాగార్జున సాగర్ కు వెళ్లి.. మళ్లీ తిరిగి కొంచెం దూరం రావొచ్చన్నమాట. ఇందులో 7.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుందని తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు