టీ20 ప్రపంచకప్‌లో సంచలనాల జట్టుగా అమెరికా! పెద్ద జట్లకు అమెరికా జట్టు సవాలుగా మారింది.టీ20 వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను USA జట్టు 2-1 తేడాతో గెలిచింది.ఆ తర్వాత ప్రపంచకప్‌లో కెనడాతో తొలి మ్యాచ్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో కెనడాను ఉతికి ఆరేసింది. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్‌నే మట్టి కరిపించి..సవాలుగా మారింది. By Durga Rao 08 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి టీ20 ప్రపంచకప్ వేదికగా అమెరికా.. ఈ మాట చెప్పగానే ఆతిథ్య దేశం కాబట్టి అమెరికాకు కూడా అవకాశం కల్పించాలనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ, ఇప్పుడు అమ్మో అమెరికా అంటున్నారు. తొలి మ్యాచ్‌లో కెనడాను ఓడిస్తే.. చిన్నజట్ల పోరులో అమెరికా గెలిచిందనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్‌ను ఓడించి ఔరా అనిపించింది. ఇక ఇదే గ్రూప్‌లో ఉన్న ఇండియా కూడా అమెరికాతో మ్యాచ్ ఆడబోతోంది. కాబట్టి మనవాళ్లూ బీకేర్ ఫుల్. ఇటీవల బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను యూఎస్ఏ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దపెద్ద జట్లకే షాకులివ్వడం అలవాటు చేసుకున్న బంగ్లా జట్టుకు షాకిచ్చింది అమెరికా. ఇదేదో గాలివాటం గెలుపు అన్నట్లుగా చాలామంది తీసిపారేశారు. కానీ, టీ20 ప్రపంచకప్‌లో కెనడాతో తొలి మ్యాచ్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో కెనడాను ఉతికి ఆరేసింది ఆ జట్టు. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్‌నే మట్టి కరిపించింది. పాక్‌ను 159 పరుగులకు కట్టడి చేసి, ఒకదశలో అలవోకగా గెలిచేయాల్సిన మ్యాచ్‌ను టైగా ముగించింది. సూపర్ ఓవర్‌లో ధనాధన్ ఆట ఆడి, మ్యాచ్ గెలిచింది స్టూవర్ట్ లా కోచింగ్ బేస్‌బాల్, బాస్కెట్‌బాల్ తప్ప క్రికెట్ లాంటి గేమ్స్‌ను పెద్దగా పట్టించుకోని అమెరికాలో ఇప్పుడు పరిస్థితి మారుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం అక్కడికెళ్లి సెటిలయిన ఇండియన్లు పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నీలతో ఈ ఆటపై ఆసక్తిని పెంచారు. మరోవైపు అమెరికా టీమ్‌లో సగం మంది ఇండియన్లే. ఐసీసీ క్వాలిఫయింగ్ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యూఎస్ఏ జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు స్టూవర్ట్ లా శిక్షణలో రాటుదేలుతోంది. #america #2024-t20-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి