AP: 'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం'.. అంబ‌టి ఆసక్తికర ట్వీట్.!

'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం' అంటూ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కూట‌మి దూరంగా ఉండాల‌ని నిర్ణయించిన విష‌యం తెలిసిందే. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఏకగ్రివంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి.

New Update
Ambati Rambabu: సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు

Ambati Rambabu: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి దాదాపు 530 ఓట్ల బలంతో ఉంది.

Also Read: మంత్రిగా ఉన్నా.. ఇస్రోకు నిధులు ఇవ్వలేకపోతున్నా: పవన్ కళ్యాణ్

ఈ విషయంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. 'వైసీపీ పూర్వవైభవానికి బీజం వేసిన బొత్స విజయం' అంటూ పోస్ట్ చేశారు. కూట‌మి ప్రభుత్వం పోటీకి దూరంగా ఉండటంతో బొత్స విజయం దాదాపు ఖరారు అయినట్లేనని తెలుస్తుంది. బొత్సతో పాటు మ‌రో స్వతంత్ర అభ్యర్థి ష‌ఫీ ఉల్లా పోటీలో ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు