Ambani Wedding : సంగీత్ లో అంబానీ డాన్స్ మామూలుగా లేదుగా.. ఫ్యామిలీతో సందడే సందడి..! అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం గ్రాండ్ గా సంగీత్ వేడుకను ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం. ఈ వేడుకలో ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి డాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. By Archana 06 Jul 2024 in బిజినెస్ సినిమా New Update షేర్ చేయండి Ambani Wedding Mukesh Nita Ambani Dance : రిలయన్స్ (Reliance) అధినేత అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అంబానీ కుటుంబం తన రెండో కోడలికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) - రాధికా మర్చంట్ (Radhika Merchant) జులై 12 న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అనంత్ - రాధికా వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం ముంబైలో సంగీత్ వేడుకను ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం. బాలీవుడ్ తారలు, స్టార్ క్రికెటర్స్, ప్రముఖులతో సంగీత్ వేడుక కళకళలాడింది. అంబానీ ఫ్యామిలీ డాన్స్ ఈ సంగీత్ లో అంబానీ కుటుంబం తమ డాన్స్ తో వేడుకను మరింత ప్రత్యేకంగా చేసింది. షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'ఓం శాంతి ఓం'లోని పాపులర్ సాంగ్ 'దీవాంగి దీవాంగి' పాటకు ముఖేష్ అంబానీ (Mukesh Ambani) తన కుటుంబంతో కలిసి డాన్స్ చేశారు. సాంగ్ మొదలవగానే ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, కొడుకు ఆకాష్, కోడలు శ్లోకా అంబానీ, కూతురు ఇషా, ఆనంద్ పిరమిల్ ఒక్కొక్కరిగా సినిమా స్టైల్ లో ఎంట్రీ ఇస్తూ స్టేజ్ పై సందడి చేశారు. చివరిలో వధూవరులు అనంత్ - రాధికా ప్రవేశించి అందరు కలిసి డాన్స్ చేశారు. Your browser does not support the video tag. సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, దీపికా పదుకొణె, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, ఎంఎస్ ధోనీ దంపతులు, హార్దిక్ పాండ్యా, అలియా భట్, రణబీర్ కపూర్, జాన్వీ, కరీనా కపూర్ పలువురు బాలీవుడ్ తారలు అనంత్- రాధికా సంగీత్ వేడుకలో పాల్గొన్నారు. Also Read: Ambani Wedding: కొడుకు సంగీత్ లో ముఖేష్- నీతా అంబానీ స్పెషల్ వీడియో.. మనవళ్ళతో కారులో షికారుకు..! - Rtvlive.com #radhika-merchant #ambani-wedding #ananth-ambani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి