Radhika Merchant : రాధికా 'శుభ ఆశీర్వాద్' లుక్.. నిజమైన బంగారంతో జర్దోజీ..!

అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ వివాహం జులై 12న ఘనంగా జరిగింది. వివాహం అనంతరం ఈ జంట శుభ ఆశీర్వాద్ వేడుకను నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ వేడుకలో రాధికా ప్రత్యేకమైన వస్త్రాలంకారణలో ఎంతో అందంగా కనిపించింది.

New Update
Radhika Merchant : రాధికా 'శుభ ఆశీర్వాద్' లుక్.. నిజమైన బంగారంతో జర్దోజీ..!

Radhika Merchant : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) - నీతా అంబానీ (Nita Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) - రాధికా (Radhika Merchant) వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం జులై 13న ఈ జంట 'శుభ ఆశీర్వాద్' వేడుకను ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం.

  publive-image

ఈ వేడుకలో వధువు రాధికా అందమైన వస్త్రాలంకారణలో అందరి దృష్టిని ఆకర్షించింది.

publive-image

ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అబు జానీ సందీప్ ఖోస్లా లెహంగాను పవిత్రమైన ఆశీర్వాద వేడుకకు ధరించారు.

publive-image

భారతీయ కళాకారిణి, శిల్పి జయశ్రీ బర్మన్, రియా కపూర్ రాధికా దుస్తులు డిజైన్ చేయడంలో సహకరించారు.

publive-image

రాధికా ప్రత్యేకమైన రోజున ఆమె ధరించిన లెహంగా ఆకర్షణీయంగా ఉండడానికి .. ఇటాలియన్ కాన్వాస్‌పై(ప్లైన్ ఫాబ్రిక్ పై) లెహంగాలో కనిపించే 12 ప్యానెల్‌లను జయశ్రీ చేతితో చిత్రించింది. లెహంగా పై నిజమైన బంగారు జర్దోజీని చేతితో ఎంబ్రాయిడరీ చేశారు.

publive-image

రాధికా ధరించిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను పూర్తిగా సిల్క్‌తో రూపొందించారు.

publive-image

సంతోషకరమైన జంటను సూచించే మానవ బొమ్మలు, దేవి రూపాలను రాధికా లెహంగా పై అందంగా డిజైన్ చేశారు. రాధికా లెహంగా పై కనిపించే ఏనుగు బొమ్మలు, పక్షులు జంతువుల పట్ల అనంత్‌కు ఉన్న అభిమానాన్ని వర్ణిస్తోంది.

publive-image

ఈ జీవ హస్తకళ సమిష్టి కొత్త ప్రారంభాల ఆనందాన్ని, ప్రేమతో జీవించే జీవితాన్ని తెలియజేస్తుంది.

publive-image

అందమైన హస్తకళలతో రూపొందిన వస్త్రాలంకారణలో రాధికా ఎంతో అందంగా కనిపించింది. Image Credits: rheakapoor, jayasriburman/Instagram

Also Read: Ambani Wedding: అంబానీ పెళ్ళిలో సినీ తారల డాన్సులు.. సందడే సందడి..! వీడియో వైరల్ - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు