OTT లో అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్.. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా?

హాలీవుడ్, కొరియన్ సిరీస్‌ల తరహాలో జాంబీస్ ఆధారంగా భారతదేశంలో ఇటువంటి సినిమాలు, షోలు రూపొందుతున్నాయి. సైఫ్ అలీఖాన్ సినిమా గో గోవా గాన్ తో ఈ ట్రెండ్ మొదలైంది. అయితే ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ఓ థ్రిల్లర్ సిరీస్ వస్తుంది.అదేంటో చూసేయండి!

New Update
OTT లో అద్భుతమైన థ్రిల్లర్ సిరీస్.. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా?

Betaal Web series: OTT ప్లాట్‌ఫామ్ లో ప్రతివారం కొత్త వెబ్ సిరీస్‌లు,సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రోజుల్లో ఎంటర్ టైన్ మెంట్ కోసం ఓటీటీ అనేది అతిపెద్ద మాధ్యమంగా మారింది.అయితే OTT ప్లాట్‌ఫామ్ నెట్ ఫిక్స్ లో 2020లో రిలీజ్ అయిన 4 ఎపిసోడ్ ల హారర్ థ్రిల్లర్ సిరీస్ ఆడియన్స్ ని భయపెట్టడమే కాకుండా మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఈ సిరీస్ షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించబడింది.గత కొన్నేళ్లుగా పౌరాణిక కథల స్ఫూర్తితో సినిమాలు, సీరియల్స్‌ లేదా సిరీస్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. మనం మాట్లాడుతున్న సిరీస్ కూడా ఇలాంటి కథనం నుండి ప్రేరణ పొందిందని చెప్పబడింది.

ఒక గుడిలో ఒక తెగ పూజలతో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ లో కొందరు స్త్రీలు ఆత్మతో మాట్లాడతారు. సొరంగం తెరవడాన్ని దేవుడు నిషేధించాడని ఓ మహిళ చెబుతుంటది.మరోవైపు ఈ సొరంగం ద్వారానే జాతీయ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తది. గ్రామస్తులు సొరంగం పగలగొట్టడానికి నిరాకరిస్తారు, ఆ తర్వాత ప్రభుత్వం బలగాలను మోహరిస్తుంది, ఆ తర్వాత అధికారి గ్రామస్తులను అక్కడి నుండి తరిమివేస్తాడు. ఈ ప్రక్రియలో అతను పురాణం గురించి తెలుసుకుంటాడు, అయినప్పటికీ అతను సొరంగం తవ్వమని ఆదేశిస్తాడు. దీని తర్వాత సిరీస్‌లో భయానక గేమ్ మొదలవుతుంది. భయంకరమైన బ్రిటిష్ సైన్యం సొరంగం నుండి ఉద్భవించడం ప్రారంభిస్తుంది, దానితో ఒక దయ్యం యుద్ధం ప్రారంభమవుతుంది.

Also Read: ‘ఫ్యాన్‌ మూవీ’ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణకు అనుమతి

సిరీస్ క్లైమాక్స్ చాలా ప్రమాదకరమైనది. భయంకరమైన ముఖాలు కలిగిన వ్యక్తులు వారి శరీరాలపై రక్తం, కాలిన గుర్తులతో ముందుకు వస్తారు, ఇది చాలా భయపెడుతుంది. ఇలాంటి దృశ్యాలు చూడాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ సిరీస్‌ను ‘ఘౌల్’ దర్శకులు పాట్రిక్ గ్రాహం,నిఖిల్ మహాజన్ సంయుక్తంగా రూపొందించారు. ఈ సిరీస్‌లో వినీత్ కుమార్ సింగ్, అహానా కుమ్రా ప్రధాన పాత్రలు పోషించారు. సిరీస్‌లో కేవలం 4 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్నాయి, దీని పేరు ‘బేతాల్(Betaal)".తాళ్ సిరీస్ లో నటించినప్రతి ఒక్కరూ మంచి నటన కనబరిచి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కూడా ఈ సిరీస్ కి మంచి రేటింగ్స్‌ మాత్రం రాలేదు. IMDb దీనికి 5.4 రేటింగ్ ఇచ్చింది. మీరు ఈ సిరీస్‌ని Netflixలో చూడవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment