Gujarat: బాధ్యత గా ఓటు వేసిన రెండు చేతులు లేని వ్యక్తి.. వీడియో వైరల్! ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామందికి బద్దకం. కొందరైతే కార్యాలయాలకు సెలవిచ్చినా ఇంట్లోనే ఉండిపోతారు. కానీ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. అయితే, ఓ వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా తన బాధ్యతగా కాలితో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది ఎక్కడంటే.. By Durga Rao 07 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామందికి బద్దకం. కొందరైతే కార్యాలయాలకు సెలవిచ్చినా ఇంట్లోనే ఉండిపోతారు. కానీ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు మాత్రం వేయరు. అయితే, ఓ వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా తన బాధ్యతగా కాలితో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇవాళ గుజరాత్‌లో మూడో దశ పార్లమెంట్ ఎన్నికల్లో అంకిత్ సోని అనే వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా కాలితో ఓటువేసి ఔరా అనిపించాడు. గుజరాత్‌లోని నడియాడ్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశాడు. ఈ సందర్భంగా 'ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయండి' అంటూ అంకిత్ పిలుపునిచ్చాడు. శరీరంలో అన్ని అవయవాలు కరెక్టుగా ఉన్నా ఓటు వేసేందుకు బద్దకించేవాళ్ల చెంపమీద కొట్టినట్టుగా రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును వినియోగించుకున్నాడు. చిత్తశుద్ధి ఉండాలేగానీ దేనికీ అవిటితనం అడ్డుకాదని అతడు నిరూపించాడు. తనకు 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో రెండు చేతులు తెగిపోయాయని అంకిత్ సోని తెలిపాడు. అయినా గత 20 ఏళ్లలో తాను ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదని చెప్పాడు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో తాను ఓటు వేస్తానని తెలిపాడు. అంకిత్ కాలితో ఓటు వేసిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. ఓటు వేసేందుకు బద్దికించే వాళ్లు అంకిత్ సోనిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. #WATCH | Nadiad, Gujarat: Ankit Soni, a voter, casts his vote through his feet at a polling booth in Nadiad He says, "I lost both my hands due to electric shock 20 years ago. With the blessings of my teachers and guru, I did my graduation, CS... I appeal to people to come out… pic.twitter.com/UPx8G5MTPz — ANI (@ANI) May 7, 2024 #viral-vidio మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి