Beauty Tips : అలోవెరా వాడండి బ్యూటీ పెంచుకోండి!

అలోవెరాను చర్మం,జట్టుకు ఉపయోగించే దివ్య ఔషదం. దీనిని వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా..జట్టు రాలుటను నివారించి ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలోవెరాలో ఉండే ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇప్పుడే చూసేయండి!

New Update
Beauty Tips : అలోవెరా వాడండి బ్యూటీ పెంచుకోండి!

Beauty Secret Of Aloe Vera : ప్రతి ఇంట్లోనూ అలోవెరా(Aloe Vera) ఈజీగా దొరుకుతుంది. ఇది ఓ సహజ మూలిక అని చెప్పొచ్చు. దీనిని వాడడం వల్ల చర్మం, జుట్టుని కాపాడుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ పెంచుకోగల ఈ మొక్క జెల్‌ని అందాన్ని కాపాడుకోవడానికి వాడొచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలు(Pimples), నల్ల మచ్చలు, ముడతల్ని దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్, పిగ్మంటేషన్, మొటిమల్ని దూరం చేస్తాయి. చాలా మందికి ముఖం, చర్మంపై నల్ల మచ్చలు ఉంటాయి. వీటి వల్ల బ్యూటీని దెబ్బతీస్తాయి. చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడం వల్లే ఈ బ్లాక్ హెడ్స్(Black Heads) వస్తాయి. అదే విధంగా, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కూడా బ్లాక్ హెడ్స్ పేరుకుపోతాయి. దీనిని పోగొట్టేందుకు అలొవెరా స్క్రబ్ హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం అలోవెరా జెల్‌లో కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి సమస్య ఉన్న ప్రాంతంలో మసాజ్ చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.

చాలా మందికి మొటిమల సమస్య ఉంటుంది. ఈ సమస్యని దూరం చేసేందుకు ఖరీదైన క్రీమ్స్ రాయకుండా అలోవెరాని వాడొచ్చు. అలోవెరా జెల్‌(Aloe Vera Gel) లో నిమ్మరసంని కలపండి. నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. దీనిని నేరుగా ముఖానికి రాయొద్దు. జెల్‌లో మిక్స్ చేసి రాసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.

చర్మ సమస్యల్లో(Skin Problems) మరొకటి పిగ్మంటేషన్. దీని వల్ల చూడ్డానికి అందంగా కనిపించదు. దీనిని దూరం చేసేందుకు కూడా అలోవెరా బాగా పనిచేస్తుంది. అందుకోసం అలోవెరా జెల్‌లో కొద్దిగా తేనె కలిపి రాయండి. తేనెలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఇది చర్మాన్ని కాంతివంతంగా, రంగుని మెరుగ్గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్‌ని మీరు పిగ్మంటేషన్‌ ఎక్కువగా ఉండే కళ్ళ చుట్టూ ముఖానికి అప్లై చేయొచ్చు.

ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్క పదార్థం పడాలని లేదు. అందుకే, ఎవరైనా సరే అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. అదే విధంగా, అలోవెరా జెల్ త్వరగానే ఆరిపోద్ది. అందుకే, ఎక్కువసేపు ఉంచకుండా త్వరగానే క్లీన్ చేసుకోవాలి. దీనిని వారానికి రెండు, మూడు సార్లు రాస్తే మంచిది. రాత్రుళ్ళు రాస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది.

Also Read : బ్రకోలితో బరువు తగ్గండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు