Alluri: మన్యంలో మంటకలిసిన మానవత్వం.. కొండ కాలువలో మగశిశువు కలకలం

ఏపీలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారేడుమిల్లికి పేరు ఉంది. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆలాంటి ప్రాంతంలో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.

New Update
Alluri: మన్యంలో మంటకలిసిన మానవత్వం.. కొండ కాలువలో మగశిశువు కలకలం

మన్యంలో దారుణం

మన్యం జిల్లాలో మానవత్వం మంట కలిసి పోయింది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు మానవత్వాన్ని మరిచి కొండ కాలువలో పడేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని పోపసికందును ఇలా చూస్తే ప్రాణం చలించిపోతుంది. గుర్తుతెలియని వ్యక్తులు మానవత్వాన్ని మరిచి ఇలాంటి దారుణానికి వడిగట్టారు.

ఒళ్లంతా రక్తపు మరకలు

వివరాల్లోకెళ్తే.. వినాయక చవితి సమయంలో పసికందును గుర్తు తెలియని కసాయి వ్యక్తులు చిదిమేశారు. ఆ పసికందును కొండ కాలువలో పడేశారు. స్థానిక సంతమార్కెట్ సమీపంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన స్థానికులకు కాలువలో తేలియాడుతు కనిపించిన పసికందు దేహాన్ని చూసి చలించిపోయ్యారు. చనిపోయి తెలియాడుతున్న శిశు దేహం దగ్గర వెంటనే వెళ్లి మగశిశువును స్థానికులు బయటకు తీసుకొచ్చారు. ఒళ్లంతా రక్తపు మరకలు ఉండడంతో అప్పుడే పుట్టిన శిశువు గుర్తించి శుభ్రం చేశారు. ఆ తరువాత సమీపంలో ఆ పసికందు దేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన మారేడుమిల్లిలో ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.

మారేడుమిల్లి ప్రాంత ప్రజలంతా ఆందోళన

మారేడుమిల్లిలోని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలోని జలపాతాలతో ఈ ఘటన చోటుచేసుకోటం చాలా బాధాకరం. ఇంకా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిశువుని ఎవరు పడేశారు..? ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. పండగ పూట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మారేడుమిల్లి ప్రాంత ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు