TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు మార్చి 1 నుంచి షురూ చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించి టైంటేబుల్ ను ప్రకటించనుంది.

New Update
TS EdCET: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!

TS Inter Exams : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలను మార్చి 1నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు  (TS Inter Board)కసరత్తు ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించి టైంటేబుల్ ను విడుదల చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలకు, జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి కొంతముందుగానే పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.
గతేడాది విద్యాసంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడద పరీక్షలు ఉండటంతో ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు కంటే విద్యార్థులు ప్రిపేర్ అవడానికి వీలుంటుంది. దీనికి తోడు ఇంటర్ తర్వాతే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని. ఈసారి జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం అవ్వడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుసమాచారం. కాగా ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ..గ్యారెంటీ హామీల అమలే లక్ష్యం..!!

ఈసారి మార్పులివే:
ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల పరీక్ష లేదు. అందులోని అంశాలను ఇంగ్లీష్ సబ్జెక్టులో మిళితం చేసినట్లు ఇంటర్ బోర్డు వర్గాలు ఇప్పటికే తెలిపాయి. గతంలో రాయని పాతవిద్యార్థులకు మాత్రం ఉంటుంది. అయితే మొదటి ఏడాది ఎన్విరాన్ మెంట్ స్టడీస్ పరీక్ష మాత్రం అందరికీ ఉంటుంది.కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇంగ్లీష్ సబ్జెక్టులో 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. రాతపరీక్ష 80 మార్కులకే ఉంటుంది. ప్రాక్టికల్స్ ను ఆయా కళాశాలలే నిర్వహిస్తాయి. భాష అనేది మాట్లాడితేనేవస్తుందని భావించి ఈ మార్పులు చేసింది.

ఇక ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు బీటెక్ లో చేరేందుకు మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాలి. ఇంటర్ పరీక్షలప్పుడు చివరిలో బ్రిడ్జి కోర్సు పరీక్షను నిర్వహిస్తారు. అది రాయాలంటే ఖచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది విద్యార్థులకు ఇది తెలియదు. దాంతో వారు పరీక్షలు రాసేందుకు వీల్లేకుండా పోతుంది. అందుకేఈసారి బ్రిడ్జి కోర్సు పరీక్షకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అందరూ బ్రిడ్జి కోర్సుకు హాజరయ్యేలా హాల్ టికెట్లపై తేదీలను ప్రింట్ చేయనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ గ్రూపు విద్యార్థులు హాజరుకావచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు