APPSC Group-2 Results: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక అప్డేట్!

ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50నిష్పత్తిలో కాకుండా 1:100నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతోపాటు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

New Update
APPSC Group-2 Results: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక అప్డేట్!

APPSC Group-2 Results : ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50నిష్పత్తిలో కాకుండా 1:100నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతోపాటు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నోటిఫికేషన్ జారీకి, ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం తమకు ప్రిపరేషన్ కు సరిపోదని, ప్రశపత్రం కఠినంగా ఉండటం, భారత సమాజం చాప్టర్ కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా వచ్చాయని..ఇలాంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అభ్యర్థులు ప్రభుత్వానికి , ఏపీపీఎస్సీకి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్క పోస్టుకు వంది మంది చొప్పున మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని బోర్డుకు అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమిషన్ పరిశీలిస్తుందని ప్రిలిమ్స్ ఫలితాల విడుదల నాటికి దీనిపై అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు.

కాగా ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరతుండగా.. ప్రశ్నపత్రంలో ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్ లేషన్ లో తప్పులు దొర్లడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాలతో మెయిన్స్ ఎగ్జామ్స్ కు ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: అసలే ఏనుగు…ఆకలేస్తే ఇట్లుంటది మరి..ఏకంగా గోడౌన్‎నే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు