రాజమహేంద్రవరంలో విమానాశ్రయం.. వైసీపీ, బీజేపీ నేతల కామెంట్స్!

రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. రాజమండ్రిలో విమానాశ్రయం ఏర్పాటుపై బీజేపీ, వైసీపీ నేతలు కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఎంపీ భారత్ కేంద్రాన్ని కోరారు.

New Update
రాజమహేంద్రవరంలో విమానాశ్రయం.. వైసీపీ, బీజేపీ నేతల కామెంట్స్!

రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కేంద్ర మంత్రి వెంట ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజమండ్రి ఎంపీ భారత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కామెంట్స్..

రాజమండ్రి ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసుకోవడం మన అదృష్టం అని అన్నారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మౌలిక వసతులను సమకూర్చుకుంటేనే భారతదేశం ఆ స్థాయికి వెళ్తుందని అన్నారు. చిన్నచిన్న వృత్తుల వారు కూడా ఆర్థికంగా ఎదిగే దిశగా భారత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంలో మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా నెంబర్ వన్ స్థలంలో ఉంచాలని అన్నారు.

రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కామెంట్స్...

రాజమండ్రి ఎయిర్ పోర్టు అభివృద్ధి జరిగితే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేర్చాలని అన్నారు. విమానాశ్రయానికి విస్తరణకు ఎంతోమంది రైతులు తమ భూములు ఇచ్చి త్యాగం చేశారని పేర్కొన్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో కార్గో వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాజమండ్రి ఎంపీ భరత్ కామెంట్స్ ...

రాజమండ్రి నుంచి ఢిల్లీకి... చెన్నైకి వెళ్లే విమానాలు కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు భారత్. సాధ్యమైనంత తొందరలోనే టెర్మినల్ బిల్డింగు పూర్తి చేయాలని అన్నారు. కడియంలో 25వేల హెక్టార్ల భూమిలో మొక్కల పెంపకం జరుగుతుందని తెలిపారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు కార్గో టెర్మినల్ కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు