Air India : లగేజి పాలసీ మార్చిన ఎయిరిండియా... ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే...! దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు లగేజీ తీసుకెళ్లే వీలుంటుంది. By Durga Rao 05 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Luggage : కొన్నాళ్ల కిందటివరకు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India) ప్రస్తుతం టాటా గ్రూప్(Tata Group) అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. టాటాల చేతుల్లోకి వచ్చాక ఎయిరిండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. తాజాగా సంస్థ లగేజీ పాలసీని కూడా మార్చారు. దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు మాత్రమే లగేజీ తీసుకెళ్లే వీలుంటుంది. ఎకానమీ క్లాస్ లోని ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటిదాకా ఈ పరిమితి 20 కేజీల వరకు ఉండేది. ఎయిరిండియా ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో ఉచిత లగేజీ పరిమితి 25 కేజీలు ఉండేది. ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేశాక ఈ పరిమితిని 20 కేజీలకు కుదించింది. తాజాగా, మరో ఐదు కేజీలు తగ్గిస్తూ, 15 కేజీలు మాత్రమే ఉచితంగా అనుమతిస్తామని ఎయిరిండియా తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిబంధన మే 2 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఎకానమీ క్లాస్ లోని ఫ్లెక్స్ కేటగిరీలో ప్రయాణించేవారికి మాత్రం 25 కేజీల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. డీజీసీఏ(DGCA) మార్గదర్శకాల ప్రకారం ఏ ఎయిర్ లైన్స్ సంస్థ అయినా కనీసం 15 కేజీల లగేజీని ఉచితంగా అనుమతించాల్సి ఉంటుంది. అయితే, ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ఈ 15 కేజీలను సింగిల్ బ్యాగేజి రూపంలో అనుమతిస్తుండగా, ఎయిర్ లైన్స్ మాత్రం నిర్దేశిత బరువుకు లోబడి ఎన్ని బ్యాగేజిలైనా తీసుకెళ్లేందుకు అనుమతిస్తోంది. Also Read : అవన్నీ తప్పుడు కథనాలు.. పురుగుమందుల అవశేషాల పరిమితులపై FSSAI స్పష్టీకరణ #air-india #tata-group #free-luggage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి