/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-100-jpg.webp)
Legal Notice For Fighter Movie: బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫైటర్’ (Fighter) చిక్కుల్లో పడింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ సీన్స్ విమర్శలకు దారితీస్తున్నాయి. అంతేకాదు ఇందులోని ఓ సన్నివేశంపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు (Air Force) చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది.
ముద్దు సన్నివేశం..
ఈ మేరకు అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్ (Soumyadeep Das).. ఇందులోని ముద్దు సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ సన్నివేశంలో హీరో, హీరోయిన్ ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్‌లో ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనిఫాంలో అలాంటి సీన్స్ చేయడమంటే.. దాన్ని అవమానించినట్లేనని ఆరోపించారు. దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందోననే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి : Tamil Nadu: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్.. ఏమన్నారంటే
విమాన పైలట్లుగా..
ఇక ఇండియన్ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్ యాక్షన్ చిత్రంగా దీన్ని రూపొందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇందులో హృతిక్, దీపికలు యుద్ధ విమాన పైలట్లుగా కనిపించారు. ఈ సినిమా విజయంపై ఆనందం వ్యక్తంచేసిన హృతిక్ రోషన్ దీనికోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ‘ఇందులో నా లుక్ కోసం కఠోరంగా శ్రమించా. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా. ఏడాదిపాటు స్నేహితులను కూడా కలవలేదు. త్వరగా నిద్రపోయేవాడిని. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవాడిని’ అని చెప్పారు.